Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ట్రైలర్: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా..?
By: Tupaki Desk | 23 Dec 2021 5:02 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ లో జరిగిన భారీ ఈవెంట్ లో 'రాధే శ్యామ్' ట్రైలర్ ను ఆవిష్కరించారు.
'అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు' అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రేమ పెళ్లి అనే వాటికి తావు లేకుండా కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి పుజా హెగ్డే (ప్రేరణ) వస్తుంది. 'నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు..' అంటూ ఆమెను ముద్దుల వరకూ తీసుకొచ్చాడు.
అదే సమయంలో ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా.. పామిస్ట్రీకి ఐన్ స్టీన్ ప్రభాస్ ను పరిచయం చేసారు. 'పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు' అంటూ తన పాత్ర స్వభావాన్ని తెలియజేసారు.
'ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంత చదవ గలవో చూస్తాను' అంటూ ప్రేరణ తన చేయి అందించింది. దీనికి 'కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం' అని ప్రభాస్ చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. విక్రమాదిత్య - ప్రేరణ ప్రేమకథలో జ్యోతిష్యం - సైన్స్ లు కీలక పాత్ర పోషించబోతున్నట్లు అర్థం అవుతోంది. వీరి జీవితాలకు ట్రైన్ మరియు షిప్ మునిగిపోవడం - భూకంపం రావడం వంటి అంశాలను లింక్ చేస్తూ ట్రైలర్ లో చూపించారు.
'విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?' అని ప్రభాస్ చెప్పే డైలాగ్ 'రాధే శ్యామ్' సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. విక్రమాదిత్య - ప్రేరణలు విధిని ఎదిరించి ఒకటయ్యారా లేదా? వీరి ప్రేమకథ చివరకు ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. మొత్తం మీద దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఓ వినూత్నమైన పప్రేమ కథను తెర మీద ఆవిష్కరించారని అర్థం అవుతోంది.
'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్ - పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ లుక్స్ మరియు యాక్టింగ్ - పాత్ర చిత్రీకరణ చాలా కొత్తగా ఉన్నాయి. పుజాతో రొమాంటిక్ సీన్స్ చేసి డార్లింగ్ రోజులను గుర్తు చేశారు. పూజా కూడా ఇందులో అందంగా కనిపించింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెరిసారు. భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - సత్యన్ ఇతర పాత్రలు పోషించారు.
'రాధే శ్యామ్' ట్రైలర్ లో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. అలానే దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచింది. 70ల కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ ని సృష్టించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెర మీద కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేయగా.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేశారు.
నాలుగు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. హిందీ వెర్సన్ కు మిథున్ తో పాటుగా మరో ఇద్దరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ పాన్ ఇండియా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లోనూ 'రాధే శ్యామ్' సినిమా విడుదల కానుంది.