Begin typing your search above and press return to search.
ఇది సల్మాన్ 'సీటీమార్' సాంగ్.. బన్నీ తో పోలిక తప్పలేదుగా..!
By: Tupaki Desk | 26 April 2021 7:37 AM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. మే13న ఈ చిత్రాన్ని ఒకేసారి థియేట్రికల్ మరియు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వర్క్ చేశారు. తన సినిమాలలో తెలుగు చిత్రాల రెఫరెన్స్ వాడుకునే సల్మాన్.. ఈసారి 'రాధే' కోసం తెలుగు పాట 'సీటీమార్' ను రీమిక్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'DJ-దువ్వాడ జగన్నాథం' చిత్రం కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన 'సీటీమార్' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట బాగా నచ్చి సల్మాన్ రీమిక్స్ చేయమని కోరడంతో.. దేవిశ్రీ హిందీలో ఈ పాటను మళ్ళీ కంపోజ్ చేశారు.
తాజాగా 'రాధే' చిత్రం నుంచి 'సీటీమార్' సాంగ్ విడుదలైంది. ఇందులో సల్మాన్ తో పాటుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ స్టెప్పులు వేసింది. జానీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. షబ్బీర్ అహ్మద్ సాహిత్యం అందించగా.. కమాల్ ఖాన్ - లులియా వంతుర్ కలిసి ఆలపించారు. ఈ సాంగ్ తో దేవిశ్రీప్రసాద్ నార్త్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. అయితే అందరూ ఊహించినట్లే తెలుగు సీటీమార్ కి హిందీ సాంగ్ కు పోలికలు మొదలయ్యాయి. హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ స్థాయిలో సల్మాన్ చేయలేదని కామెంట్స్ వస్తున్నాయి. బన్నీ గ్రేస్ స్వాగ్ ఏమాత్రం సల్మాన్ సాంగ్ లో కనిపించలేదని అంటున్నారు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ తో పాటుగా నెగిటివ్ కామెంట్స్ - మీమ్స్ వస్తుండటం గమనార్హం. ఇంతకముందు 'ఆర్య 2' లోని ‘రింగ రింగ’ పాటను 'రెడీ' చిత్రం కోసం రీమేక్ చేసినప్పుడు కూడా ఇవి తప్పలేదు. అయితే ఈ పాటలో కాలు కదిపిన దిశా పటానికి మంచి మార్కులే పడుతున్నాయి. సల్మాన్ పై ట్రోల్స్ వస్తున్నా దేవిశ్రీ కంపోజిషన్ కి మాత్రం హిందీ ఆడియన్స్ సీటీ మార్ అంటున్నారు. ఈ పాటతో ఇప్పటికే సౌత్ లో సంచలనం సృష్టించిన రాక్ స్టార్.. ఇప్పుడు నార్త్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పవచ్చు.
ఇకపోతే 'సీటీమార్' సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. ''అల్లు అర్జున్ ధన్యవాదాలు. ఈ పాటకు మీరు పెర్ఫార్మ్ చేసిన విధానం, మీరు డ్యాన్స్ చేసిన విధానం, మీ స్టైల్, చాలా అద్భుతంగా ఉన్నాయి. లవ్ యూ బ్రదర్'' అని తెలిపారు. అయితే బన్నీతో కంపారిజన్ వచ్చి మీమ్స్ తో ట్రోల్స్ చేస్తారని ముందుగానే ఊహించని సల్మాన్ ఇలా ట్వీట్ తో అల్లు అర్జున్ కి క్రెడిట్ ఇస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సల్మాన్ ట్వీట్ కు స్పందించిన బన్నీ.. ''థాంక్యూ సో మచ్ సల్మాన్ గారు. మీ నుండి అభినందనలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మధురమైనది. మీ కోసం సీటీమార్ చేస్తున్న అభిమానులతో స్క్రీన్ మీద 'రాధే' చేసే మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నాను'' అని పేర్కొన్నారు.