Begin typing your search above and press return to search.
RRR డేట్స్ కోసం 'రాధేశ్యామ్' ప్రయత్నాలు..?
By: Tupaki Desk | 24 Jan 2022 8:49 AM GMTయావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'రాధేశ్యామ్'. సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు వీటిని సమ్మర్ సీజన్ లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఇప్పటికే RRR సినిమా కోసం రెండు విడుదల తేదీలను లాక్ చేశారు. కరోనా కరుణించి వంద శాతం థియేటర్లు అందుబాటులోకి వస్తే 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇదే క్రమంలో ఇప్పుడు 'రాధే శ్యామ్' మేకర్స్ కూడా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఒకవేళ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం వెనక్కి తగ్గితే 'రాధే శ్యామ్' చిత్రాన్ని మార్చి 18న థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ RRR అదే తేదీకి రావాలని ఫిక్స్ అయితే మాత్రం.. రాధే శ్యామ్ సినిమాని ఏప్రిల్ 28ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య క్లాష్ మంచిది కాదనే ఉద్దేశ్యంతో 'ఆర్.ఆర్.ఆర్' కోసం రెండు రిలీజ్ డేట్స్ లాక్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
'ఆర్.ఆర్.ఆర్' 'రాధేశ్యామ్' సినిమాల విడుదల తేదీలను దృష్టిలో పెట్టుకొని మిగతా చిత్రాల డేట్స్ ని ప్లాన్ చేసుకోనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసిన సినిమాలు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా RRR కు ముందూ వెనుక రెండు వారాల పాటు మరో పెద్ద సినిమా రావడానికి సాహసించకపోవచ్చు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫిక్షనల్ పీరియాదికల్ యాక్షన్ డ్రామాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ - అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అలియా భట్ - అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
మరోవైపు డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని రూపొందించారు. ఎలాంటి ఫైట్స్ లేకుండా ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో టీ సిరీస్ వారు రిలీజ్ చేస్తున్నారు.