Begin typing your search above and press return to search.
ఆ ఒక్క కాంప్లిమెంట్ చాలు నాకు: 'రాధేశ్యామ్' డైరెక్టర్
By: Tupaki Desk | 13 March 2022 4:30 AM GMTప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' సినిమా రూపొందింది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా 79 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ విక్రమాదిత్యగా కనిపిస్తాడు.
ఆయన చెప్పే జాతకానికి తిరుగుండదు. ఆయన ఒక అమ్మాయి చేయి చూసి ఆమెకి ఇష్టమైన స్పోర్ట్స్ వైపు వెళ్లలేదు అని చెబుతాడు. ఆ తరువాత నిజంగానే ఆ అమ్మాయి ఒక ప్రమాదంలో తన చేయిని కోల్పోతుంది. ఒక సందర్భంలో విక్రమాదిత్యకి ఎదురై 'చేతులు లేనివారికి గీతాలు ఉండవు కదా .. అంటే వారికీ భవిష్యత్తు లేనట్టేనా'? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
తాజాగా మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక అనే అమ్మాయి మాట్లాడుతూ .. "నాకు చేతులు లేవు .. ఈ సినిమా చూసి నేను నేర్చుకున్నది ఒక్కటే. చేతిలోని గీతాలను నమ్మకుండా పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం" అంటూ చెప్పుకొచ్చింది. చేతిలోని గీతలను తలరాతలుగా చేసుకుని కష్టపడతాను అంటూ ఆమె ఒక వీడియోను కూడా వదిలింది.
ఆ వీడియో పై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా స్పందించాడు. "స్వప్నిక అనే ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. నా నెంబర్ ఎలా సంపాదించిందో తెలియదు. నాతో ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పింది.
'థ్యాంక్స్ అన్నా చేతులు లేనివారికి కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్పావు' అంటూ ఆ అమ్మాయి చాలా ఎమోషనల్ అయింది. ఆ ఒక్క మాట చాలు అనిపించింది. ఇన్నేళ్ల నా కష్టం ఫలించిందని అనిపించింది. ఆ అమ్మాయికి నేను గుడ్ లక్ చెబుతున్నాను.
సినిమా ఈ స్థాయిలో ఆడియన్స్ కి రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నాడు. ఇక 'రాధే శ్యామ్' సినిమా విషయానికి వస్తే, కథ హీరో .. హీరోయిన్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఈ రెండు పాత్రలపైనే ఫోకస్ చేస్తూ మిగతా పాత్రలను పట్టించుకోలేదు.
జగపతిబాబు పాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు. భాగ్యశ్రీని పాత్రను ఉపయోగించుకున్నదీ లేదు. ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ .. జయరామ్ పాత్ర .. మురళీశర్మ రోల్ .. ఇలా ఉన్న కొన్నిపాత్రలను కూడా ఉపయోగించుకోలేకపోయారు.
అయితే కథ పెద్దగా లేకపోయినా ఉన్న దానికి విజువల్ బ్యూటీగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరు బలహీనంగా ఉన్నప్పటికీ, సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ సినిమాను కొంతవరకూ ఆదుకున్నాయనే చెప్పాలి.