Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' డబుల్ ధమాకా.. డార్లింగ్ అభిమానులే అతిధులు..!
By: Tupaki Desk | 15 Dec 2021 3:06 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''రాధే శ్యామ్''. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ పాన్ ఇండియా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ లో ఇన్నాళ్లూ నిదానమే ప్రదానం అన్నట్లుగా వ్యవహరించిన 'రాధే శ్యామ్' మేకర్స్.. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. వరుస అప్డేట్స్ తో సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది. దీని కోసం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
'రాధే శ్యామ్' సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 23వ తేదీన ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అభిమానుల చేత ట్రైలర్ లాంఛ్ చేయించాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమేతే ఒకే రోజున డార్లింగ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. తమ ఫేవరేట్ హీరోని చూడటమే కాకుండా.. ట్రైలర్ ను ఆవిష్కరించే అవకాశం దక్కినట్లే. మరి త్వరలోనే 'రాధే శ్యామ్' ఈవెంట్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.
ఇకపోతే 'రాధే శ్యామ్' ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. అలానే రిలీజ్ కు 30 రోజులు మాత్రమే ఉండటంతో స్పెషల్ ఇంటర్వ్యూలు - ప్రోగ్రామ్స్ తో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.
సంక్రాంతి బరిలో ఇప్పటికే పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' - ప్రాంతీయ చిత్రం 'భీమ్లా నాయక్' ఉన్నాయి. వీటికి పూర్తిగా భిన్నమైన జోనల్ లో రూపొందిన ''రాధే శ్యామ్'' కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలు.
నాలుగు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ - హిందీ వెర్సన్ కు మిథున్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో భాగ్యశ్రీ - జగపతిబాబు - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - సత్యన్ ఇతర పాత్రలు పోషించారు. 'సాహో' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న ప్రభాస్.. ''రాధే శ్యామ్'' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.