Begin typing your search above and press return to search.

హిందీలో ప్రభాస్ సినిమాకు దారుణమైన వసూళ్ళు..!

By:  Tupaki Desk   |   18 March 2022 3:30 AM GMT
హిందీలో ప్రభాస్ సినిమాకు దారుణమైన వసూళ్ళు..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ''రాధేశ్యామ్'' సినిమా గత శుక్రవారం భారీ స్థాయిలో విడుదల అయింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. నేషనల్ వైడ్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్ళు వచ్చినా.. దాన్ని వీక్ డేస్ లో కంటిన్యూ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'బాహుబలి' సినిమాలతో నార్త్ మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు ప్రభాస్. ఇదే క్రమంలో వచ్చిన 'సాహో' సినిమా కూడా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన 'రాధేశ్యామ్' మూవీ మాత్రం పరాజయాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా హిందీ వెర్షన్ ను డిజాస్టర్ గా పరిగణిస్తున్నారు.

'రాధే శ్యామ్' హిందీ వెర్షన్ 100 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేయబడింది. అయితే బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా ఫైనల్ రన్‌ లో రూ. 20 కోట్ల నెట్ లోపే ముగిసే అవకాశం ఉంది. దీనిని బట్టి ప్రభాస్‌ కు ఇది భారీ ప్లాప్ అనే చెప్పాలి.

మంగళవారం 'రాధే శ్యామ్' హిందీ వెర్సన్ రూ. 1.15 కోట్ల నెట్‌ ని వసూలు చేసింది. ఇది సోమవారం కలెక్షన్స్ తో పోలిస్తే 20 శాతం తక్కువ. వీక్ డేస్ లో ఈ మూవీ వసూళ్ళు స్థిరంగా డ్రాప్‌ అవుతూ వస్తున్నాయి. మొదటి ఐదు రోజుల్లో రూ. 16.65 కోట్లు నెట్ మాత్రమే సాధిందింది.

నార్త్ మార్కెట్ లో 'రాధేశ్యామ్' కు 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ప్రభాస్ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు డ్రాప్ అవుతూ వస్తుంటే.. 'కాశ్మీర్ ఫైల్స్' మాత్రం బాక్సాఫీస్ సాలిడ్ నంబర్స్ నమోదు చేస్తూ వెళ్తోంది.

హిందీలో 'రాధే శ్యామ్' వసూళ్ళు (నెట్) క్రింది విధంగా ఉన్నాయి.
శుక్రవారం - రూ. 4.5 కోట్లు
శనివారం - రూ. 4.5 కోట్లు
ఆదివారం - రూ. 5 కోట్లు
సోమవారం - రూ. 1.5 కోట్లు
మంగళవారం - రూ. 1.15 కోట్ల
మొత్తం – రూ. 16.65 కోట్లు (నెట్)

ఉత్తరాదిలో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 'రాధేశ్యామ్' పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాతి రోజుల్లో డ్రాప్ అయ్యాయి. లాంగ్ రన్ లో ప్రభాస్ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి. ఇక నిర్మాతలు మాత్రం నాన్-థియేట్రికల్ హక్కులతో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. శాటిలైట్ రైట్స్ - డిజిటల్ మరియు మ్యూజిక్ హక్కులు భారీ ధరకు అమ్ముడవ్వడంతో రిలీజ్ కు ముందే మంచి లాభాలను పొందారు.

కాగా, 'రాధేశ్యామ్' చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ కీలక పాత్రలు పోషించారు.

కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ లవ్ స్టోరీని నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు.