Begin typing your search above and press return to search.
ఎక్స్‌క్లూసివ్ :'రాధేశ్యామ్' కోసం రెండు రిలీజ్ డేట్‌లు
By: Tupaki Desk | 27 Jan 2022 7:31 AM GMTకారోనా, ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా వరకు భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తాయని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూసిన `ఆర్ ఆర్ ఆర్`, `రాధేశ్యామ్` రిలీజ్ లు అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ, పైగా `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్ర రిలీజ్ కోసం యావత్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే తాజాగా దేశంలో నెలకొన్ని విపత్కర పరిస్థితుల కారణంగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. ఇదే తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం `రాధేశ్యామ్`. ప్రభాస్ నటించిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వింటేజ్ లవ్ స్టోరీగా యూరప్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించిన తీరు, తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో డావిస్సీ ఓడని తలపించే ఓడ ప్రమాదం, ఇటలీ రైల్ మిస్సింగ్ ని తలపించే ట్రైన్ ఎపిసోడ్.. డెస్టినీ, ప్రేమ ల సమాహారంగా తెరకెక్కించిన తీరు సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త టైటానిక్ తరహా లవ్ స్టోరీగా ఈ మూవీని ట్రేడ్ వర్గాలతో పాటు సగటు సినీ ప్రియులు అభివర్ణించారు. దీంతో ఈ మూవీపై కూడా అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే జనవరి 14న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ వైరస్ కారణంగా వాయిదా పడింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని ఇవే కారనాలతో వాయిదా వేసిన మేకర్స్ ఈ చిత్ర విడుదల కోసం రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న మా చిత్రాన్ని విడుదల చేస్తామంటూ మేకర్స్‌ప్రకటించారు. ఇదే తరమాలో `రాధేశ్యామ్` మూవీ మేకర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం రెండు డేట్ లని అనుకుంటున్నారని తెలిసింది.
మార్చిలో ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే న రిలీజ్ చేయాలని లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసక్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అంటే `ఆర్ ఆర్ ఆర్` కి ముందే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని `రాధేశ్యామ్` మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` కు కనీసం రెండు వారాల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.
దీంతో రెండు చిత్రాల మధ్య ఎలాంటి పోటీ వుండే అవకాశం లేదని, కలెక్షన్ ల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది వుండదని `రాధేశ్యామ్` మేకర్స్ ప్లాన్. ఇదే జరిగితే `రాధేశ్యామ్` బాక్సాపీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లని రాబట్టడం ఖాయమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అంటూ జరుగుతున్న ప్రచారానికి రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించడం ద్వారా స్ట్రాంగ్ రిప్లై ని ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా వుంటే త్వరలోఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి `రాధేశ్యామ్` మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. రిలీజ్ డేట్ లని కూడా ఫైనల్ చేయబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ఏర్పాట్లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అంటే గత కొన్ని రోజులుగా సరైన ట్రీట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రైలర్ తో సర్ ప్రైజింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారన్నమాట.