Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ సరే `రాధేశ్యామ్` సన్నివేశం ఏమిటో!
By: Tupaki Desk | 12 April 2021 5:30 AM GMTమహమ్మారీ ఏ ముహూర్తానా మొదలైందో కానీ షంటేస్తోంది. అన్ని పరిశ్రమల కంటే టాలీవుడ్ మరీ ఎక్కువగా నష్టపోతోంది. అసలే జోరుమీదున్న తెలుగు సినీపరిశ్రమ.. అనూహ్య మలుపులతో ప్రపంచ స్థాయికి ఎదిగేసే వేళ అనుకోకుండా అడ్డు పుల్లలా తయారైంది కరోనా.
అందునా డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ లో ఖాన్ లనే ఢీకొడతాడు! అని చర్చ సాగుతున్న ఈ టైమ్ లో ఇది ఊపిరాడనివ్వడం లేదు. బాహుబలి-బాహుబలి 2- సాహో చిత్రాలతో బాలీవుడ్ లో సత్తా చాటిన ప్రభాస్ పై ఎన్నో అంచనాలున్నాయి. హిందీ- తెలుగు మార్కెట్లో బంపర్ హిట్లు కొట్టేస్తాడని వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాల్ని ప్రకటించడమే గాక.. వాటిని పరుగులు పెట్టిస్తూ వేడి పెంచాడు ప్రభాస్..
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ టైమ్ లో రిలీజ్ కి వస్తున్న రాధేశ్యామ్ సన్నివేశమేమిటన్నదే అర్థం కావడం లేదు. రాధేశ్యామ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంతలోనే రిలీజ్ కి వస్తోంది అనుకుంటే ఇప్పుడు సెకండ్ వేవ్ తో నిర్మాతలకి కష్టాలు మళ్లీ మొదలైనట్లేనన్న చర్చ సాగుతోంది. పొరపాటున థియేటర్స్ లో 50 శాతం ఆకుపెన్సీకి తగ్గిస్తే మాత్రం అది మైనస్ గా మారుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం కూడా లేకపోలేదన్న టాక్ ఉంది. దీనికి తోడు టికెట్ రేట్ల తగ్గింపు బెనిఫిట్ షోల రద్దు అంటూ వకీల్ సాబ్ కి జరిగింది చూశాం. కానీ ప్రభాస్ విషయంలో ఎలా ఉంటుందో..!
ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి..! ఎక్స్ పెక్టేషన్స్ ఓవర్ అవ్వకుండా కావాలనే ఈ సినిమాకు లోప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారట. అయినా కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. వకీల్ సాబ్ లా ఏదైనా మ్యాజిక్ జరిగితే రాధేశ్యామ్ కూడా ఈ క్రైసిస్ నుంచి బయటపడితే అది అందరికీ హ్యాపీనే.