Begin typing your search above and press return to search.
బ్లూమ్యాట్ విధానంలో రాధేశ్యామ్ మేకింగ్ వీడియో
By: Tupaki Desk | 20 Nov 2020 3:30 AM GMTప్రభాస్ - పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యువి క్రియేషన్స్ - గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ బృందం ఇటలీలో నెల రోజుల షెడ్యూల్ ను పూర్తి చేసి..నవంబర్ మొదటి వారంలో తిరిగి భారతదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో నిర్మించిన భారీ సెట్ లో పీరియడ్ డ్రామా కి చెందిన తదుపరి షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. కొన్ని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాల్ని ఇక్కడ చిత్రీకరించనున్నారు. ప్రధాన నటులు ఇంకా సెట్స్ కి చేరాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఈలోగానే దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సోషల్ మీడియాలో రాధే శ్యామ్ మేకింగ్ వీడియోను అభిమానుల కోసం షేర్ చేశారు. బ్లూ మ్యాట్ విధానంలో అవసరం మేర సన్నివేశాల్ని చిత్రీకరిస్తూ మానిటర్ లో వీక్షిస్తున్న వీడియో ఇది. 7 సెకన్ల క్లిప్ లో షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విధానం అర్థమవుతోంది. ``ఇది నా DOP మనోజ్ తో కలిసి.. వర్చువల్ రియాలిటీ తో బ్లూ స్క్రీన్ ప్రపంచంలోకి పయనం`` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. విమర్శకుల ప్రశంసలు పొందిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం కెమెరా వర్క్ చేయడం ప్రధాన బలంగా చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ.
‘రాధే శ్యామ్’ కోసం నిర్మించిన ప్రత్యేక సెట్ కోసం నిర్మాతలకు రూ .30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఈ సీక్వెన్స్ కోసం స్టంట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారని.. ఇంతకు ముందు అతను 2.O . కంగన రనౌత్ మణికర్ణిక వంటి భారతీయ చిత్రాలకు పనిచేశాడని తెలిసింది.
యువి క్రియేషన్స్ -గోపికృష్ణ బ్యానర్లతో కలిసి టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు. ‘రాధే శ్యామ్’ 1920 లలో పారిస్ నేపథ్యంలో సాగే కథాంశం. హృదయాన్ని హత్తుకునే ఉద్వేగాల్ని రగిలించే ప్రేమకథా చిత్రమిదని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్-డ్రామాలో భాగ్యశ్రీ- ప్రియదర్శి- సచిన్ ఖేద్ కర్ - మురళి శర్మ- సాషా చెత్రి- ఖునాల్ రాయ్ కపూర్ - సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.