Begin typing your search above and press return to search.
ఎంత టెన్షన్ వున్నా రావడం పక్కా అంటున్నారే
By: Tupaki Desk | 1 Jan 2022 10:58 AM GMTదేశ వ్యాప్తంగా రోజు రోజుకీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ రాష్ట్రం గురించి తీసుకున్నా కోవిడ్ కేసులే. ఒమిక్రాన్ వార్తలే. అంతే కాకుండా వరుసగా సినీ తారలు కూడా కోవిడ్ భారిన పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ లు ప్రకటించిన సినిమాలు బరిలోకి దిగుతాయా లేదా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని సినిమాల రిలీజ్ లు వాయిదా పడే అవకాశం వుందంటూ వార్తలు కూడా జోరందుకున్నాయి.
అంతే కాకుండా సంక్రాంతి బరిలో ఈ నెల 7న విడుదల కానున్న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా పడుతోందని, ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా వున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ షాకిచ్చాడు. తను నటిస్తున్న `రాధేశ్యామ్` విడుదల ఖచ్చితంగా జనవరి 14నే వుటుందని మరో సారి క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
`ఆర్ ఆర్ ఆర్` వాయిదా పడుతుందని టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ జరుగుతున్న వేళ ప్రభాస్ తన సినిమా ఎన్ని టెన్షన్ లు వున్నా జనవరి 14నే వచ్చేస్తోందంటూ మరోసారి డేట్ ని ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూ ఇయర్ సందర్భంగా జనవిరి 1న `రాధేశ్యామ్` మేకర్స్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ప్రేమకు విధికి మధ్య యుద్ధం అనే కాన్సెప్ట్ ని తెలియజేస్తూ పోస్టర్ పై కొన్ని అక్షరాలని పొందు పరిచిన మేకర్స్ ఇదే పోస్టర్ కింది భాగంలో సినిమా 14 జనవరి 2022న విడుదల అవుతుందని మరో సారి డేట్ ని ప్రకటంచి రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ పై చర్చ జరుగుతున్న వేళ మా సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్ కే విడుదల అవుతునందని `రాధేశ్యామ్` మేకర్స్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఓ అందమైన ప్రేమకథకు. విధికి మధ్య జరిగిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ప్రేమించిన ప్రేమే ప్రేమని చంపేస్తుందన్న విభిన్నమైన పాయింట్ తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం ఖాయం అంటున్నారు.
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదా?.. దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో `రాధేశ్యామ్` మేకర్స్ ధైర్యమేంట్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కోవిడ్ వైరస్ ప్రబలుతున్న సమయంలోనే ఇటలీ వెళ్లిన ప్రభాస్ టీమ్ అక్కడ కీలక సన్నివేశాలని పూర్తి చేసుకుని సేఫ్ గా ఇండియాలో అడుగుపెట్టింది. ప్రభాస్ , పూజా హెగ్డే ఇటలీ వెళుతుంటే అంతా ఏంటీ వీళ్ల ధైర్యం అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు కోవిడ్, ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో మారుతున్న పరిస్థితులకు వెరవకుండా మళ్లీ అలాంటి డేర్ స్టెప్‌తో సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతుండటం నిజంగా వారి డేర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు సినీ జనం.