Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ : రాధేశ్యామ్ ఆన్ లొకేషన్ అన్ సీన్
By: Tupaki Desk | 10 March 2022 2:36 PM GMTఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు.
దాదాపుగా పది వేల స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది అనే ప్రచారం మొదటి నుంచి జరుగుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఎన్ని థియేటర్లలో విడుదలైంది.. ఎంత కలెక్షన్ వస్తుంది అనేది విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక సినిమా ప్రమోషన్ విషయంలో మొదట్లో ప్రభాస్ అభిమానులకు చిరాకు కలిగించే విధంగా యు.వి.క్రియేషన్స్ మరియు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ వ్యవహరించారు.
ఒకానొక సమయంలో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ అప్డేట్ ఇవ్వడం లేదంటూ యు.వి.క్రియేషన్స్ ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన ఘన చరిత్ర అభిమానులకు ఉంది. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఈ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు వారాలుగా చాలా జోరుగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు యూవి క్రియేషన్స్ సంస్థ నిర్వహిస్తుంది. సోషల్ మీడియా.. వెబ్ మీడియా ఇంకా అనేక రకాల మాధ్యమాల్లో ఈ సినిమా ప్రమోషన్ ను నిర్వహిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ని ముందు నుంచి ప్రెస్ మీట్ లు నిర్వహించడం మరియు ఇంటర్వ్యూలు ఇప్పించడం ద్వారా సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంకా కూడా సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు వర్కింగ్ స్టిల్స్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇన్ని రోజులుగా విడుదల చేయని ఈ ఫోటోలని ఇప్పుడు విడుదలకు ముందు బయటకు వదలడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులంతా కూడా సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా విజువల్ వండర్ గానే ఉంటుంది అనే నమ్మకం మరింత ఎక్కువ అవుతుంది.
పబ్లిసిటీ పిక్స్ లో చేసిన ఈ సినిమా కు ఫలితం ఎలా ఉంటుంది అనేది మరికొన్ని గంటల్లో వెళ్లడి కాబోతుంది. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినిమా అభిమాని కూడా ఇంతగా ఎదురు చూడటానికి కారణం కరోనా తర్వాత రాబోతున్న అతి పెద్ద ఇండియన్ సినిమా ఇదే.