Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పటి నుంచో తెలుసా?

By:  Tupaki Desk   |   28 March 2022 1:30 PM GMT
రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పటి నుంచో తెలుసా?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజే చేయబోతున్నట్లు తెలియజేస్తూ... అమెజాన్ సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారు... థియేటర్లలో చూసినా మళ్లీ చూడాలి అనుకునే వారు ఈ శుక్రవారం నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లో చూడొచ్చు. అయితే ప్రభాస్ – పూజా హెగ్డే వింటేజ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్.. ఈ సినిమాపై ఈ సిననిమా డైరెక్టర్ రాధా కృష్ణ స్పందించారు. మా సినిమాపై ప్రశంసలు, విమర్శలు రెండూ ఒకేలా వస్తున్నాయి.

సినిమా రిలీజ్ అయిన సమయంలో కొంత మంది నుంచి నెగిటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారని వెల్లడించారు. సినిమా చాలా బాగుందని... ఎమోషనల్ గా కనెక్ట్ అవుతన్నామని మెస్సేజ్ లు పెడుతున్నట్లు వివరించారు.

ముఖ్యంగా నా భార్య నుంచి వచ్చి ప్రశంసలు మర్చిపోలేనంటూ రాధేశ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ ఎమోషనల్ అయ్యారు. అయితే మూవీ విడుదల అయ్యాక.. తాను ప్రభాస్ ను కలవలేదని తెలిపారు. అందుకు కారణం... ప్రభాస్ ప్రస్తుతం హాలీడే ట్రిప్ లో ఉన్నట్లు రాధా కృష్ణ తెలిపారు. అంతే కాదు తామిద్దరం ఫోన్ లో కూడా మాట్లాడుకోవడం లేదని.. కానీ మెసేజ్ మాత్రం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.

అలాగే మొదటి మూడు రోజులు నా ఇమేజ్ సినిమా ని డామినేట్ చేస్తుందని ప్రభాస్ తనకు చాలా సార్లు చెప్పినట్లు డైరెక్టర్ రాధా కృష్ణ గుర్తు చేశారు. రాధేశ్యామ్ లో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హస్త సాముద్రిక నిపుణుడి పాత్ర పోషించిన సంగతి విధితమే. తెరపై ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీతో పాటు పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

కథ ఏంటంటే... విక్రమాదిత్య (హీరో ప్రభాస్) పేరు మోసిన హస్త సాముద్రిక నిపుణుడు. ఆయన ఇటలీలో నివసిస్తుంటాడు. జ్యోతిష్యంలో ఆయన అంచనాలు వంద శాతం నిజం అవుతుంటాయి. తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకున్న విక్రమ్... తన జీవితం గురించి కూడా ఓ స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేరణ ని ( పూజా హెగ్డే )ని కలుస్తాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది, వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఎలాంటిది అనేది మిగతా కథ.