Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఎందులో..?
By: Tupaki Desk | 15 March 2022 3:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. మార్చి 11న భారీ స్థాయిలో ఈ మూవీ విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ ఎలా వున్నా సినిమా మాత్రం దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పుడు వసూళ్ల పరంగా దుమ్ము రేపుతోంది. ప్రభాస్ చిత్రాలకు పూర్తి భిన్నంగా హెరిటేజ్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
1970వ దశకంలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని రూపొందించారు. వింటేజ్ అంధాల నేపథ్యంలో రూపొందిన విజువల్ వండర్ కావడంతో చాలా మంది ఈ సినిమాని చూడాలని ఆసక్తిని చూపిస్తున్నారట. విధికి- ప్రేమకు మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు సరికొత్త నేఫథ్యంలో తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పాలమిస్ట్ (హస్త సాముద్రికా నిపుణుడు) తన జీవితంలో ఎదురైన సవాళ్లని ఎలా అధిగమించాడు? .. విధికి ఎదురెళ్లి తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు అన్నది `రాధేశ్యామ్`లో ప్రత్యేకం.
రిలీజ్ కు ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఈ మూవీ రిలీజ్ తరువాత కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తికగా ఎదురుచూశారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభ వసూళ్ల పరంగా ఈ మూవీ రికార్డులు సృష్టిస్తున్న వేళ ఈ మూవీపై ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వార్త బయటికి రానుందట. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి స్ట్రీమింగ్ హక్కుల్ని సొంతం చేసుకుందని, ఏప్రిల్ 2న స్ట్రీమింగ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని తెలిసింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం కావడంతో అదే రోజున `రాధేశ్యామ్` స్ట్రీమింగ్ ని ప్రారంభించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.