Begin typing your search above and press return to search.

మెటావ‌ర్స్ ప్ర‌యోగంలో రాధేశ్యామ్ రేర్ ఫీట్

By:  Tupaki Desk   |   3 March 2022 2:33 PM GMT
మెటావ‌ర్స్ ప్ర‌యోగంలో రాధేశ్యామ్ రేర్ ఫీట్
X
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ `రాధే శ్యామ్` ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు-త‌మిళం- హిందీ స‌హా బ‌హుభాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. ప్ర‌భాస్ ద‌శాబ్ధం త‌ర్వాత ఒక పూర్తి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించారు. అందుకే అభిమానులలో ఈ చిత్రం కోసం ఎదురుచూపులు స్పష్టంగా క‌నిపిస్తోంది. సాహో త‌ర్వాత సుదీర్ఘ గ్యాప్ తో డార్లింగ్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఇప్పుడు మేకర్స్ దీనిని మరో మెట్టు పైకి తీసుకువెళుతున్నారు. రాధే శ్యామ్ ప్రపంచంలోనే మెటావర్స్ లో వారి స్వంత అవతారాలను సృష్టించే అవకాశాన్ని ప్రజలకు అందించే మొదటి చిత్రంగా నిలవ‌నుంది. ప్రాజెక్ట్ కోసం కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ మెటావర్స్ వంటి డైనమిక్ విశ్వాన్ని మునుపెన్నడూ ఏ సినిమా అన్వేషించని తీరులో ఆవిష్క‌రించారు.

ఈరోజు ప్రత్యక్ష ప్రసారం అయిన రాధే శ్యామ్ మెటావర్స్ లింక్ ద్వారా వినోద ప్రియులు ఇప్పుడు తమ స్వంత ప్రత్యేక అవతార్ లను సృష్టించుకోగలరు. ఇప్పటికే రూ.1.5 లక్షల మంది దీనిని వినియోగించుకున్నారు.

రాధే శ్యామ్ తన కొత్త ట్రైలర్ ను నిన్న ముంబైలో ప్రభాస్- పూజా హెగ్డే.. దర్శకుడు రాధా కృష్ణ కుమార్- నిర్మాతలు భూషణ్ కుమార్.. వంశీ ..ప్రమోద్ లతో కలిసి లాంచ్ చేసారు. ఇది చాలా అసాధారణమైన చిత్రం అని అభిమానులు ప్రశంసించారు. బహుభాషల్లో మెప్పించే ప్రేమకథా చిత్ర‌మిది. 1970లలో యూరప్ నేప‌థ్యంలో సాగుతుంది. రాధే శ్యామ్ ప్రత్యేక కర్టెన్ రైజర్ వీడియోలో కనిపించే విధంగా చాలా నావ‌ల్టీతో విభిన్నమైన కాన్సెప్ట్‌ను తెర‌పై ఆవిష్క‌రించారు.

సినిమా పాటలు పోస్టర్ లు టీజర్ లు రికార్డ్ బ్రేకింగ్ స్థానాన్ని సంపాదించాయి. కర్టెన్ రైజర్ కూడా ఇంటర్నెట్ లో తుఫాన్ గా మారింది. లెజెండ‌రీ అమితాబ్ బచ్చన్ సూత్రధారిగా తన గాత్రాన్ని అందించిన ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో టాప్ నాచ్ స్పెషల్ ఎఫెక్ట్స్ మ‌రో హైలైట్. ఇటలీ- జార్జియా - హైదరాబాద్ ల నుండి వచ్చిన సుందరమైన దృశ్యాలు మైమ‌రిపింప‌జేస్తాయి. ప్రభాస్- పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ మ్యాజికల్ టచ్ ప్రేక్ష‌కుల్ని ప‌ర‌వ‌శంలో ముంచేస్తుంది.

గుల్షన్ కుమార్ - T-సిరీస్ సమర్పణలో UV క్రియేషన్స్ ప్రొడక్షన్ రాధే శ్యామ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - వంశీ- ప్రమోద్ నిర్మించారు.