Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న రాధేశ్యామ్ షూట్ వార్త
By: Tupaki Desk | 7 Dec 2021 10:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా వచ్చే నెలలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా పాటలను విడుదల చేస్తూ కొత్త పోస్టర్స్ ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో సందడి వాతావరణ కల్పించారు. అభిమానులు రాధే శ్యామ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒకటి రెండు వారాల్లో ట్రైలర్ వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ షూటింగ్ కు రెడీ అవుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో నాలుగు లేదా అయిదు రోజుల పాటు రాధే శ్యామ్ షూటింగ్ ఉంటుందని.. దాంతో షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాధే శ్యామ్ షూటింగ్ అదుగో పూర్తి.. ఇదుగో పూర్తి అంటూ రెండు మూడు నెలల నుండి ప్రచారం జరింది. మళ్లీ ఇప్పుడు ఈ చివరి షెడ్యూల్ ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు యూవీ క్రియేషన్స్ మరియు దర్శకుడు రాధాకృష్ణ పై పీకల్లోతు కోపంతో ఉన్నారు.
ఇలాంటి సమయంలో షూటింగ్ ను మళ్లీ ఇప్పుడు మొదలు పెడుతున్నట్లుగా చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ షూటింగ్ అంటూ వస్తున్న వార్తలు అభిమానులకు కలవర పాటును గురి చేస్తున్నాయి. చిన్న షెడ్యూల్ కనుక ఎలాంటి ఆందోళన లేదు అనేది మీడియా వర్గాల మాట.
ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించింది. బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సౌత్ వర్షన్ మరియు హిందీ వర్షన్ వేరు వేరుగా ఉండబోతున్నాయి. పాటలు మాత్రమే కాకుండా నటీ నటులు మరియు సన్నివేశాలు కూడా కొన్ని వేరు వేరుగా ఉంటాయని అంటున్నారు. ఇలా వేరు వేరుగా ప్రతిది రెండు మూడు సార్లు షూట్ చేయడం వల్లే ఇంత సమయం పట్టిందని అంటున్నారు. సాహో సినిమా విడుదల కంటే ముందు ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. అప్పటి నుండి సినిమా రెండు మూడు వారాల్లో విడుదల అవుతుంది అన్నా కూడా షూటింగ్ ను ముగించలేక పోయిన దర్శక నిర్మాతలను ప్రభాస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాత కూడా షూట్ చేసి మళ్లీ జాయిన్ చేస్తాం అంటారేమో అంటూ కొందరు అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.