Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' ట్రెండ్ కంటిన్యూ..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 11:30 AM GMT
రాధేశ్యామ్‌ ట్రెండ్ కంటిన్యూ..!
X
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల తేదీకి మరో మూడు వారాల సమయం ఉంది. అయినా కూడా సోషల్‌ మీడియాలో రేపే విడుదల అన్నట్లుగా సందడి పీక్స్‌ లో ఉంది. భారీ ఎత్తున అంచనాలున్న రాధేశ్యామ్‌ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మరియు పోస్టర్ లు వీడియోలు సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి ఒక్క పాట కూడా చాలా బాగుంది అంటూ అభిమానుల నుండి టాక్ వచ్చింది. భారీ అంచనాలున్న రాధేశ్యామ్‌ ట్రైలర్‌.. పోస్టర్‌ లు ఇలా ఏదో ఒక అప్‌డేట్‌ తో సినిమా సోషల్‌ మీడియాలో గత నెల రోజులుగా ట్రెండ్‌ అవుతూనే ఉంది.

ఈ ట్రెండ్‌ సినిమా విడుదల అయ్యే వరకు కొనసాగుతూనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా హడావుడి కాస్త తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో ఏదో ఒక అప్‌ డేట్‌ ను ఇస్తున్నారు. ట్రైలర్‌ హడావుడి కాస్త తగ్గుతున్న ఈ సమయంలో సినిమా నుండి మరో పాటను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మేకర్స్‌ సౌత్‌ ప్రేక్షకుల కోసం రాధే శ్యామ్‌ నుండి మరో పాటను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమై అధికారికంగా అప్‌ డేట్‌ రాబోతుంది. కొత్త సంవత్సరం కానుకగా ఆ సాంగ్‌ ఉండే అవకాశం ఉందంటున్నారు. టైటిల్‌ సాంగ్ ను రాధే శ్యామ్‌ మేకర్స్ భారీ అంచనాల నడుమ విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు వాయిదా వేశారు.

ఎట్టకేలకు సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పాటు కొత్త సంవత్సరం కావడంతో రాధే శ్యామ్‌ టైటిల్ సాంగ్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాధే శ్యామ్‌ కు సంబంధించిన అప్‌ డేట్స్ ఎప్పటికప్పుడు సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న పాట కూడా ఖచ్చితంగా సినిమా స్థాయిని మరింతగా పెంచుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ఇక సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్ర పోషించడం తో అభిమానులు మరింత ఆసక్తిగా ఉన్నారు. మూడు ఏళ్ల ఎదురు చూపులకు బ్రేక్ పడే టైమ్ వచ్చింది. ఈ ఎదురు చూపులకు ఖచ్చితంగా ప్రతిఫలం గా మంచి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుందని.. ప్రేక్షకులు కోరుకున్న ఒక మంచి ప్రేమ కథను ఈ సినిమా లో చూడవచ్చు అన్నట్లుగా మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.