Begin typing your search above and press return to search.

రాధిక ఆప్టే వ్యాఖ్యలు నూరు శాతం నిజం

By:  Tupaki Desk   |   16 April 2019 7:45 AM GMT
రాధిక ఆప్టే వ్యాఖ్యలు నూరు శాతం నిజం
X
నటిగా గుర్తింపు దక్కించుకునేందుకు హీరోయిన్‌ పాత్రను మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రను అయినా చేస్తానంటూ చెప్పే నటి రాధిక ఆప్టే. ఒక వైపు హీరోయిన్‌ గా నటిస్తూనే మరో వైపు కీలక పాత్రలు, వెబ్‌ సిరీస్‌ ల్లో చేస్తున్న రాధిక ఆప్టే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొందరికి అవి రుచించకున్నా కూడా ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఈమద్య కాలంలో చాలా మంది వారసత్వంగా వచ్చిన స్టార్స్‌ పై విమర్శలు చేస్తున్నారు. వారసులుగా వచ్చిన వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయ పడుతుంటే, రాధిక ఆప్టే మాత్రం బ్యాక్‌ గ్రౌండ్‌ తో వచ్చినా కూడా వారికి ట్యాలెంట్‌ ఉంటేనే వారు స్టార్స్‌ అవుతారు. పలువురు స్టార్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చారు. కొందరు బ్యాక్‌ గ్రౌండ్‌ తో వచ్చి కూడా స్టార్స్‌ కాలేక పోయారు. అందుకే ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన స్టార్స్‌ అవుతారని కాదు, కష్టపడి, ట్యాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టార్స్‌ అవుతారు.

ఇక ఇండస్ట్రీలో అందరు కూడా ఒకేలా ఉంటారని భావించవద్దు. ఆడవారు లైంగిక వేదింపులకు గురవుతున్న విషయం నిజమే, కాని అది కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ వల్లే ఎక్కువగా జరుగుతుంది. ఒక సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ కొందరు నీచంగా ప్రవర్తిస్తారు. వారి వల్ల ఇండస్ట్రీలో అందరికి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో హీరో, హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో చాలా అంతరం ఉండటంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చపై కూడా రాధిక ఆప్టే తనదైన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోకు 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేయగల సత్తా ఉంది. అదే నాలాంటి హీరోయిన్‌ కు కోటి వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరు కూడా సేమ్‌ పారితోషికం ఎలా డిమాండ్‌ చేస్తారు. అందుకే హీరోయిన్‌ పారితోషికం హీరో కంటే తక్కువ అయినా తానేం ఫీల్‌ అవ్వను అంది. అయితే హీరో హీరోయిన్‌ కాకుండా సినిమాలో నటించే ఇతర నటీనటుల విషయంలో సమాన ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వారికి మగాళ్ల కంటే ఆడవారికి తక్కువ పారితోషికం ఇవ్వడంను నేను ఒప్పుకోను అంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుల విషయంలో మగ, ఆడ తేడా ఉండవద్దని రాధిక చెప్పింది. ఈ మూడు విషయాల్లో రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం అంటూ అంతా కూడా ఒప్పుకుంటున్నారు.