Begin typing your search above and press return to search.

శృంగారం చేస్తా.. కథకి అవసరం అనిపిస్తే.. స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   15 Jun 2020 4:00 PM GMT
శృంగారం చేస్తా.. కథకి అవసరం అనిపిస్తే.. స్టార్ హీరోయిన్
X
స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి సినీ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్.. కామెడీ.. అడల్ట్ ఇలా అమ్మడు చేయని సినిమా జోనర్ లేదు. సినిమా కోసం ఏమి చేయడానికి అయినా సిద్దంగా ఉంటుంది. సినిమాలలోనే కాకుండా తన అందాల ఆరబోత డిజిటల్ వెబ్ సిరీస్ లలో కూడా ఊపేస్తుంది. ఇదివరకే అహల్య, బద్లాపూర్‌ లాంటి సినిమాలో నగ్నంగా నటించి సంచలనం రేపింది రాధికా. అయితే టాలీవుడ్, కోలీవుడ్.. సినిమాలలో మాత్రం అమ్మడు సంప్రదాయ పాత్రలే చేసింది. స్టార్ హీరోలు రజినీకాంత్, బాలకృష్ణ సినిమాలతో పాటు రక్తచరిత్ర సినిమాలో కూడా కనిపించింది. అయితే అమ్మడి కెరీర్ లో హుందాతనంతో నిండిన పాత్రలు మాత్రం తక్కువ చేసిందని చెప్పాలి.

కొన్నిసార్లు తను నటించిన శృంగార సన్నివేశాలు లీక్ అవ్వడం కూడా జరిగాయి అంటూ.. గతంలో రాధికా నటించిన ''ద వెడ్డింగ్ గెస్ట్'' అనే ఇంగ్లీష్ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ.. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ లీకై నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సీన్‌లో రాధికా ఆప్టే, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ నగ్నంగా కన్పించారు. అయితే ఆ సీన్ తో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది అమ్మడు. అంతేగాక లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్ కూడా నటించాడని.. అతనిని మాత్రం వదిలిపెట్టి.. తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడితే ఎలా అంటుంది.

మొత్తానికి బాలీవుడ్‌లోనే సెటిల్‌ అయిన ఈ భామ సినిమాలు అడపాదడపా చేస్తూ.. సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేస్తుంది. శృంగార భరిత ఫోటోషూట్లతో అభిమానులను రెచ్చగొడుతోంది. బీచ్‌లో భామ బికినీ అందాలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇటీవలే సినిమాలు ఎందుకు తగ్గించారనే ప్రశ్నకు రాధికా స్పందిస్తూ.. "ఇక బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగాను. వేదికపై నగ్నంగా నటించడానికి వెనుకాడను. కథకి అవసరమైతే శృంగారం చేయడానికి నేను రెడీ. ఈ నేపథ్యంలో నన్ను చాలా మంది రొమాంటిక్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా? కేవలం శృంగారం చేయడం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు" అంటూ రాధిక ఘాటుగా తేల్చేసింది. ఇకనైనా దర్శక నిర్మాతలు విషయం గ్రహించాలని అమ్మడు ఈ సందర్భంగా వెల్లడించింది.