Begin typing your search above and press return to search.
క్రేజీ హీరో అఫైర్ ను బయట పెట్టిన స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 1 July 2019 8:06 AM GMTబాలీవుడ్ కు విక్కీ కౌశల్ వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. కాని దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది మాత్రం ఇటీవల విడుదలైన 'యూరి' చిత్రంతోనే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా విక్కీ కౌశల్ మంచి క్రేజీ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో ఈయన నుండి వరుసగా పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. పలువురు నిర్మాతలు మరియు దర్శకులు ఈయన వెంట పడుతున్నారు. ఇలాంటి విక్కీ కొన్నాళ్ల క్రితం తన ప్రియురాలు హర్లీన్ సెథితో బ్రేకప్ అయ్యాడు. ఇద్దరి మద్య ప్రేమ చాలా దూరం వరకు వెళ్లింది. కాని పెళ్లిగా మాత్రం వారి ప్రేమ మారలేదు. హర్లీన్ తో బ్రేకప్ తర్వాత ఈయన మాళవిక మోహనన్ తో అఫైర్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వారిద్దరు కూడా ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఎట్టకేలకు ఆ విషయంను రాధిక ఆప్టే బాహాటంగా బయట పెట్టేసింది.
తాజాగా రాధిక ఆప్టే ప్రముఖ నటి నేహా దూఫియా నిర్వహిస్తున్న టాక్ షోలో విక్కీ కౌశల్ తో పాటు పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ఆ సమయంలోనే విక్కీ కౌశల్ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పేసింది. విక్కీ కౌశల్ సమక్షంలోనే నేహా దుఫియా ముందు ఈ విషయాలను రాధిక ఆప్టే చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది.
విక్కీ కౌశల్ మరియు మాళవికల రిలేషన్ ల గురించి రాధిక మాట్లాడుతూ.. మాళవిక మోహనన్ తో విక్కీ డేటింగ్ వార్తలు నిజమే. వారిద్దరు నాకు చిన్నప్పటి నుండి కూడా తెలుసు. వారి మద్య స్నేహం కంటే మరో బంధం ఎక్కువగా ఉంది. మాళవికతో రిలేషన్ ను విక్కీ అంగీకరించాలి. ఆమె మంచి అమ్మాయి. లవ్లీగా ఉంటుంది. వారిద్దరు కూడా తమ రిలేషన్ ను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని నేను భావిస్తున్నాను. రహస్యంగా ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీడియాలో పుకార్లు వస్తాయి. ఒక వేళ మీ రిలేషన్ గురించి బయటకు చెబితే పుకార్లు ఆగిపోతాయని రాధిక ఆప్టే విక్కీకి సలహా ఇచ్చింది. ప్రస్తుతం ముంబయిలో తల్లిదండ్రులతో మాళవిక ఉంటుందని.. ఆమెను తరచు డేటింగ్ కు తీసుకు వెళ్లేందుకు విక్కీ కలుస్తూ ఉంటాడని కూడా రాధిక చెప్పేసింది. ఇక విక్కీ మరియు మాళవికలు వారి రిలేషన్ ను అధికారికంగా బయటకు చెప్పడమే ఉంది. త్వరలోనే విక్కీ తన కొత్త రిలేషన్ గురించి చెప్తాడేమో చూడాలి.