Begin typing your search above and press return to search.
ఎన్నిసార్లు నిలదీస్తావ్ నానా?
By: Tupaki Desk | 30 July 2015 6:03 AM GMTరక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాలతో ప్రత్యేకత ఉన్న నటిగా ఆకట్టుకుంది రాధిక ఆప్టే. కట్టు, బొట్టు ఉన్న నాయికగా తెలుగులో కనిపించింది. ఉత్తరాదిన మాత్రం బద్లాపూర్, హంటర్ వంటి చిత్రాల్లో పూర్తి గ్లామర్ డాళ్ గా కనిపించింది. సందర్భాన్ని బట్టి, అవసరానికి తగ్గట్టు రూపం మార్చి తెలివిగా కెరీర్ ని ముందుకు నడిపిస్తోంది. అయితే ఈ భామకు ఎదురైన కొన్ని సంఘటనల వల్లనో ఏమో పురుషాధిక్య ప్రపంచంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంటుంది.
టాలీవుడ్ జనాలకు ఆడవాళ్లను గౌరవించడం తెలియదు అని తీవ్రమైన ఆరోపణ చేసింది అప్పట్లో. ఇప్పుడు మరోసారి చిత్ర పరిశ్రమలో ఆడవారికి అన్యాయం జరుగుతోందని గళమెత్తింది. పారితోషికం విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని రాధిక ఆప్టే ఆరోపించింది. హీరోలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించే సినిమాల్ని ఇస్తున్నా ఇంకా నాయికల్ని చులకనగానే చూస్తున్నారని విమర్శించింది.
ఇటీవలి కాలంలో కథానాయికలంతా ఇంచుమించు రాధిక ఎలాంటి భావనలో ఉందో అదే భావనలో ఉన్నారు. మేరీకోమ్, పికూ, తను వెడ్స్ మను వంటి సినిమాలు సాధించిన విజయాల్ని చూపిస్తూ .. పారితోషికంలో అన్యాయాల్ని నిలదీస్తున్నారు. రాధిక పోరాటం ఫలించి పురుషాధిక్యం తొలగిపోయి, కథానాయికల పారితోషికాలు పెరుగుతాయేమో చూడాలి.