Begin typing your search above and press return to search.

న్యూడ్‌ ఇంటర్యూకు ఇంత హడావుడా...

By:  Tupaki Desk   |   16 March 2015 9:30 AM GMT
న్యూడ్‌ ఇంటర్యూకు ఇంత హడావుడా...
X
ఆమె ఇచ్చింది ఒకే ఒక్క న్యూడ్‌ ఇంటర్యూ. అబ్బే అదేనండీ.. ఏదో ఒక ఇంటర్యూలో న్యూడ్‌ సీన్‌ గురించి చెప్పింది. ఒక ప్రముఖ ఇంగ్లాండ్‌ వెబ్‌సైట్‌.. ది గార్డియన్‌లో ఒక ఇంటర్యూ ఇచ్చింది హీరోయిన్‌ రాధికా ఆప్టే. ''హంటర్‌'' అనే ఇంగ్లీషు సినిమాలో నటిస్తున్న సందర్భంగా వారికి ఇంటర్యూ ఇచ్చింది. ఇక భారతదేశంలో ఎందుకు అమ్మాయిలు సినిమాల్లో న్యూడ్‌గా నటిస్తే నానా రచ్చ చేస్తారు అంటూ అక్కడి జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె ఏదో ఎక్స్‌ప్లెనేషన్‌ ఇచ్చింది.

ఇక్కడ మ్యాటర్‌ ఏంటంటే.. ఆమె సమాధానాలను పట్టుకొని ఇప్పుడు దాదాపు బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు ప్రతీ మీడియా చాలా హడావుడే చేస్తోంది. న్యూడ్‌గా నటించడానికి నేను రెడీ ఆమె అనేసిందని మనోళ్ళు హంగామా చేసేస్తున్నారు. మన దేశంలో ఒక యావరేజ్‌ సిటిజెన్‌ ఎవరూ రెండు ముక్కల బికినీలు వేసుకొని బీచ్‌లో తిరుగుతూ సన్‌ బాత్‌ చేయరు. కాబట్టి మనకి అలాంటి బికినీలు వేయడం అంటే కొత్త విషయంగా ఉంటుంది. అలాగే హాలీవుడ్‌లో ప్రతీ హీరోయిన్‌ ఏదో ఒక సమయంలో న్యూడ్‌గా నటిస్తుంది. అందుకే వాళ్ళకు అది కొత్తకాదు. కాని మనకు మాత్రం అది వింతే. అలాగని చెప్పి ఒక ఇంటర్యూను సాగదీసి ఇంత హడావుడి చేయడం ఎందుకు? సెక్స్‌ సెల్స్‌.. (సెక్స్‌ అముడుపోతుంది) అని ఉత్తినే అనలేదు మన ఎడ్వర్‌టైజింగ్‌ రంగంవారు..