Begin typing your search above and press return to search.
అంత గుట్టు అయితే మాల్ లో ఎందుకు?
By: Tupaki Desk | 26 July 2017 9:26 AM GMTవివాదాలతో సహజీవనం చేస్తున్నట్లుగా కొందరు ప్రముఖులు వ్యవహరిస్తుంటారు. అలాంటి కోవకు చెందుతారు బహుభాషా నటి రాధికా ఆప్టే. తన లుక్ తోనే శృంగార రసాన్ని ఒలకబోసే ఈ ఆంటీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
తాజాగా అమ్మడు ముంబయిలోని ఒక మాల్ లో బాజార్ అనే హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. రాధికా ఆప్టే లాంటి హాట్ నటి షూటింగ్ అంటే ఎంతో కొంత ఆసక్తి మామూలే. విషయం తెలిసిన మీడియా ఫోటోగ్రాఫర్లు షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. వారు అక్కడకు వెళ్లేసరికి అమ్మడు షూటింగ్ బ్రేక్ కారణంగా తనకు కేటాయించిన వ్యానిటీ వ్యాన్ లో ఉన్నారు. కాసేపటికి షూట్ స్టార్ట్ కావటంతో ఆమెను పిలిచారు.
దీంతో.. వ్యానిటీ వ్యాన్ లో నుంచి బయటకు వచ్చిన రాధికాఆప్టే ఫోటోల్ని తీశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు ఎలా తీస్తారంటూ ఫైర్ అయిన ఆమె వేసిన వీరంగం అంతాఇంతా కాదంటున్నారు. ఒక గ్లామర్ సెలబ్రిటీని ఫోటోలు తీసే ముందు కూడా అనుమతి తీసుకోవాలా? అన్నది ప్రశ్న. అయితే.. దీనికి చిత్ర వర్గాలు చెబుతున్నదేమిటంటే.. సినిమా లుక్ బయటకు రాకూడదని అనుకున్నారని అందుకే రాధికా అంతగా రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు.
ఒకవేళ అదే నిజమైతే.. గుట్టుగా నాలుగు గోడల మధ్యన షూటింగ్ చేసుకోవాలే కానీ.. మాల్ లోకి అందరి ఎదుట షూట్ లో పాల్గొంటే ఫోటోలు బయటకు రావా? అన్నది ఒక ప్రశ్న.
మీడియా ఫోటోలు తీయకున్నా.. ఇప్పుడున్న సెల్ ఫోన్లతో ఎవరికి వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే మాత్రం.. లుక్ బయటకు లీక్ అయినట్లే కదా? చూస్తుంటే రాధికా ఆప్టే వీరంగాన్ని కవర్ చేసేందుకే చిత్ర వర్గాలు ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.