Begin typing your search above and press return to search.

ఆమె హాట్ సీన్లు సీడీలేసి అమ్మేస్తున్నారట!

By:  Tupaki Desk   |   15 Sept 2016 10:01 AM IST
ఆమె హాట్ సీన్లు సీడీలేసి అమ్మేస్తున్నారట!
X
గత కొంత కాలంగా తానేమి చేసిన ఒక సంచలనంగానే మారుతుంది. కెరీర్ మొదలుపెట్టడం సాఫ్ట్ రోల్స్ తో మొదలుపెట్టినా.. తర్వాతి కాలంలో హాట్ హాట్ సీన్స్ - హాట్ హాట్ మూవీస్ దిశగా ఆమె కెరీర్ దూసుకుపోతుంది. ముఖ్యంగా హాట్ సీన్స్ - అంతకు మించిన సీన్స్ లలో ఆమెకు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఈమె అలాంటి సినిమాలకే పరిమితమా అనుకుంటున్న దశలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ చాన్స్ వచ్చింది.. ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది.. ఆమె రాధికా ఆప్టే అని!

తన అందచందాలతో - అభినయంతో - అంగాంగ ప్రదర్శనతో అభిమానులను - ప్రేక్షకులను ఒకరకమైన ఇబ్బందికి గురిచేసే రాధిక ఆప్టేకు ఈ మధ్యకాలంలో కొత్త ఇబ్బంది ఒకటి ఎదురైందట. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్‌ దేవగన్ నిర్మించిన పర్చెడ్‌ చిత్రం వల్లే ఈ సమస్య వచ్చిందట. రాధిక ఆప్తే నటుడు అదిల్ హుస్సేన్‌ తో కలిసి అర్ధనగ్న దుస్తుల్లో - ముఖ్యంగా టాప్‌ లెస్ దుస్తుల్లో నటించింది. ఈ సన్నివేశాలు ఇప్పటికే ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. అక్కడితో అయిపోయిందిలే అనుకుని ఆమె సైలంటు గా ఉంటే.. ఆ సినిమాలో పూర్తిగా 20 నిమిషాల నిడిగి ఉన్న ఈ ఫుల్ హాట్ సీన్ ని ఎవరో సీడీలేసి 90 రూపాయల చొప్పున మార్కెట్ లో అమ్మేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయంపై రాధికా కలవరపడుతుంది.

పర్చెడ్ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేసే ముందు అందులోని శృంగార భరిత సన్నివేశాలను తొలగిస్తామని ఆమెకు ముందుగానే దర్శక నిర్మాతలు చెప్పారట. దానివల్ల ఆమె హీరోయిన్ కెరీర్ కి ఏమీ సమస్య ఉండదని భావించిందట. అయితే ఇప్పుడా సన్నివేశాలు అనధికారికంగా బయటకు రావడంతో రాధిక ఆప్టే షాక్‌ కు గురైందట. అంతే కాదు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం గురించి సన్నిహితులతో ఆలోచనలు జరుపుతున్నారని సమాచారం. మరో విషయం ఏమిటంటే... ఈ పర్చెడ్ చిత్రం 24 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడి 18 అవార్డులను అందుకుందట!