Begin typing your search above and press return to search.
ఆ న్యూడ్ సీన్లు మన ధియేటర్లకు కాదులే
By: Tupaki Desk | 16 Aug 2016 1:30 PM GMT'పార్చడ్' అనే సినిమా కోసం హీరోయిన్ రాధికా ఆప్టే ఫుల్ న్యూడ్ గా ఒక సీన్ చేసింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు ఇండియాలో రిలీజ్ చేయాలంటే మరి సెన్సార్ బోర్డు వారు ఆ న్యూడిటీకి ఒప్పుకుంటారు. ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా హీరోయిన్ తన యద అందాలను మొత్తంగా చూపిస్తుంటే.. ఆ సీన్ మన తెరపై అసలు పడనిస్తారా? దీని గురించి ఇంతకీ ఈ సినిమా నిర్మాతలు ఏమంటున్నారు.
హీరో అజయ్ దేవగన్ మరియు అసీమ్ బజాజ్ లు కలసి.. లీనా యాదవ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ లీకైన సీన్ గురించి వారు మాట్లాడుతూ.. సెక్స్ సీన్ అనే పేరుతో ఒక లవ్ మేకింగ్ బిట్ ను ఇంటర్నెట్ లో రిలీజ్ చేసి మనోళ్ళు ఎంతో ఉన్మాధుల్లా బిహేవ్ చేస్తున్నారని వారు వాపోయారు. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి ప్రస్తావిస్తూ.. కేవలం ఫిలిం ఫెస్టివల్స్ లో స్ర్కీన్ చేయడానికి మాత్రమే ఈ సినిమాను తీశాం. అదీనూ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం మాత్రమే తీయడం జరిగింది. వారికి ఈ న్యూడిటీ వంటివి కొత్తేం కాదు. ఇక ఇండియాలో రిలీజ్ చేసే ఉద్దేశ్యమే మాకు లేదు కాబట్టి.. సెన్సార్ వగైరా విషయాలను గురించి మేం పట్టించుకోవట్లేదు అంటున్నారు మేకర్లు.
మామూలుగా వేరే నిర్మాతలు ఎవరన్నా అయితే.. ఆ ఒక్క సీన్ కారణంగా వచ్చిన హైపుకు సినిమాను ఇండియాలో భారీగానే రిలీజ్ చేసేవారు. కాని ఈ నిర్మాతలు మాత్రం.. మాకు రిలీజే అక్కర్లేదు అంటున్నారు. అది సంగతి.