Begin typing your search above and press return to search.
మీటూ : సాక్షాధారాలు అక్కర్లేదు
By: Tupaki Desk | 16 Nov 2018 10:34 AM GMTబాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఎప్పటికప్పుడు సంచన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉంటూనే ఉంటుంది. సౌత్ లో కూడా పలు చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఆమద్య సౌత్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక హీరో నన్ను తాకేందుకు ప్రయత్నించాడని, రూంకు వచ్చేందుకు ప్రయత్నించాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ సౌత్ హీరో ఎవరు అనే విషయం అయితే చెప్పలేదు. సౌత్ లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉందని చెప్పుకొచ్చిన రాధిక ఆప్టే తాజాగా మీటూ ఉద్యమంపై స్పందించింది.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాధిక ఆప్టే మాట్లాడుతూ.. ఇన్నాళ్లు లైంగిక వేదింపులతో ఇబ్బందులు పడ్డ మహిళలకు మీటూ ఉద్యమం ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా మీటూ ఉద్యమం ద్వారా తమకు జరిగిన అన్యాయంను, తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెప్పుకోవాలని ఆమె సూచించింది. లైంగిక వేదింపులకు గురై మీడియా ముందుకు వచ్చిన వారిని సాక్ష్యాధారాలు అడగడం ఏమాత్రం భావ్యం కాదని రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.
లైంగిక వేదింపులు ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా ఉందని, ఆ లైంగిక వేదింపులు పూర్తిగా ఆగినప్పుడు మహిళలు స్వేచ్చగా తమ పనులు చేసుకోగలరు అంటూ రాధిక చెప్పుకొచ్చింది. లైంగిక వేదింపులు చేసిన వారిపై ఆరోపణలు చేసిన మహిళను టార్గెట్ చేసి కొందరు హింసించడం చేస్తున్నారని, మీడియా వారు కూడా మీటూ ఆరోపణలకు సాక్ష్యాధారాలు అడగవద్దని రాధిక సూచించింది. సాక్ష్యాధారాలను సంపాదించుకుని లైంగిక వేదింపుల ఆరోపణలు చేసేందుకు ఏ మహిళ ఆసక్తి చూపించరు అంటూ రాధిక చెప్పుకొచ్చింది. ఈమద్య బాలీవుడ్ కే పరిమితం అయిన రాధిక సౌత్ కు మళ్లీ రానంటే రానంటోంది.