Begin typing your search above and press return to search.

మొగుడి కోసం ఉన్న ఫలాన వదిలేస్తుందిట

By:  Tupaki Desk   |   14 July 2015 4:01 PM GMT
మొగుడి కోసం ఉన్న ఫలాన వదిలేస్తుందిట
X
రివల్యూషన్‌, రెబలిజం ఈ రెండిటినీ ముద్దగా కలగలిపి ఓ రూపం తయారు చేస్తే అది అచ్ఛంగా రాధికా ఆప్టేలా ఉంటుంది. అందుకే ఈ అమ్మడు లండన్‌ బేస్డ్‌ ఎన్నారైని పెళ్లాడి యథేచ్ఛగా సినిమా ప్రపంచంలో రాణీలా తిరిగేస్తోంది. భర్త అండదండలతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇక్కడికి వచ్చిందే తడవుగా దేనికీ అడ్డు చెప్పకుండా గ్లామర్‌ ప్రపంచం ఫార్ములాకి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంది.

తెలుగువారికైతే పద్ధతిగా కనిపిస్తోంది కానీ, ఉత్తరాదిన లఘుచిత్రాల పేరుతో దుమ్ము రేపేస్తోంది. సెమీ న్యూడ్‌, న్యూడ్‌ దేనికీ అడ్డు చెప్పకుండా వలువలు వలిచేయడానికి రెడీ అవుతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలెన్నో ఆన్‌లైన్‌లో ఉన్నాయి. అంతటి ఈ రెబల్‌ .. ఈ క్షణం దిమ్మతిరిగే నగ్నసత్యాన్ని మాటల్లో ఆవిష్కరించింది.

ముంబై లాంటి నగరంలో జీవించే ప్రతి ఒక్కరూ అనుక్షణం కెరీర్‌, ఉద్యోగం, లైఫ్‌ అంటూ కొట్టుకు చస్తూనే ఉంటారు. ఆ మూసలో కొట్టుకుపోవడం తప్పని పరిస్థితి. కానీ ప్రతి ఒక్కరికీ ప్రేమ అనేది చాలా ముఖ్యం. జీవితంలో అది ఎంతో విలువైనది. మా ఆయన లండన్‌ వాసి. ఆయన కోసం ఉన్న ఫలాన అన్నిటినీ వదిలిపెట్టి వెళ్లిపోగలను'' అంటూ సెలవిచ్చింది. కాస్త కటువుగా మాట్లాడినా ఈ రెబల్‌ బేబి ఉన్నదున్నట్టు మాట్లాడింది కదూ!