Begin typing your search above and press return to search.

స్కిన్ షో.. విప్పేసి చూస్కోమనడం కాదు..

By:  Tupaki Desk   |   31 Dec 2015 9:37 AM GMT
స్కిన్ షో.. విప్పేసి చూస్కోమనడం కాదు..
X
ఎంతగా పెర్ఫామ్ చేస్తుందో. తన నటనతో ప్రేక్షకులను కట్టేస్తుందో.. అంత ఓపెన్ గానూ అందాలు ప్రదర్శిస్తుంది. కేరక్టర్ కోసం ఆప్టే చేసిన ఎక్స్ పోజింగ్ కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణమైంది. రీసెంట్ ఓ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం ఈమె డ్రెసింగ్ - మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ తారలు క్లీవేజ్ షో చేయడం కామనే అయినా.. అందులోనూ రాధికే ఆప్టే ప్రత్యేకత చూపిస్తుంది.

తనకు ఇప్పటికే పెళ్లైన విషయాన్ని దాచుకోదు. ఈమె భర్త లండన్ లో ఉంటాడు. సగం టైం తన భర్తకి - సగం సమయం తన ప్యాషన్ కి కేటాయించిందీమె. చాలామంది పెళ్లైన విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని సలహా ఇచ్చారట. అయితే. ఈమె మాత్రం అలాంటి లిమిట్స్ పెట్టుకోలేదు. ప్రస్తుతం సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తోంది రాధికా ఆప్టే. రజినీ అంత మంచి వ్యక్తిని తన జీవితంలో కలుసుకులేదని అంటోంది. మూడు నెలలుగా నాన్ స్టాప్ గా పని చేస్తున్నా అలిసిపోని వ్యక్తిత్తం అని పొగుడుతోంది. షాట్ పూర్తి కాగానే.. ఓ మూలకు వెళ్లిపోయి తన ఛైర్ లో కూర్చుంటారట రజినీకాంత్. ఆయన చుట్టూ ఉండే సహాయకులు ఇద్దరేనని, గత పదేళ్లుగా ఆయనతో ఉంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయిందట.

అంతే కాదు.. ఐటెం సాంగ్స్ - స్కిన్ షోపై బోల్డ్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చేసింది రాధికా ఆప్టే. కేవలం తన స్కిన్ ప్రదర్శించడమే అయితే.. అందుకోసం అసలు భూమి మీద ఎలాంటి అవకాశం ఉండదని చెప్పింది. సెక్సీ నెంబర్స్ చేయడానికి తాను సిద్ధమేనని, అయితే.. వాటికి ఓ బలమైన కారణం ఉండాలంటోంది. ఓంకార చిత్రంలో ఈ ప్రదర్శన బాగుంటుందట. ' వచ్చి.. ఇక్కడ నా స్తనాలు ఉన్నాయ్ చూడు' అన్నట్లుగా అందులో సన్నివేశాలు ఉండవు అంటూ... ఎక్స్ పోజింగ్ కి, స్కిన్ షోకి తానిచ్చే విలువ ఏంటో చెప్పింది రాధికా ఆప్టే.