Begin typing your search above and press return to search.

నా సెల్ఫీలు నా ఇష్టం!!

By:  Tupaki Desk   |   18 May 2018 2:30 PM GMT
నా సెల్ఫీలు నా ఇష్టం!!
X
సినిమాల కంటే కూడా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉంటుంది రాధికా ఆప్టే. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ స‌న్నివేశాల్లో న‌టించేందుకైనా... శృంగార స‌న్నివేశాల్లో రెచ్చిపోతూ క‌నిపించేందుకైనా వెన‌కాడ‌ని ఈ హీరోయిన్‌... ఏ విషయంలో అయినా మొహమాటం లేకుండా బోల్డ్‌గా కామెంట్ చేసేస్తుంటుంది. ఈ మ‌ధ్యే సౌత్ హీరోని మంద‌లించానంటూ వార్త‌ల్లో నిలిచిన ఈ భామ‌... ఇప్పుడు ‘నా సెల్ఫీలు నా ఇష్టం’ అంటూ స్టేట్ మెంట్ ఇస్తోంది.

హీరోహీరోయిన్లు బ‌య‌ట క‌నిపించిన‌ప్పుడు అభిమానులు సెల్ఫీలు అడ‌గ‌డం కామ‌న్‌. న‌టీన‌టులు త‌మ అభిమానుల‌ను నిరుత్సాహ‌ప‌ర‌చ‌డం ఇష్టం లేక హ్యాపీగా న‌వ్వుతూ సెల్ఫీలు దిగుతుంటారు. అయితే రాధికాకి మాత్రం సెల్ఫీలు దిగ‌డం అస్స‌లు న‌చ్చ‌ద‌ట‌. త‌న ద‌గ్గ‌రికి ఫ్యాన్స్ వ‌చ్చి సెల్ఫీ దిగుతామ‌ని రిక్వెస్ట్ చేస్తే... వెంట‌నే నో అని క‌రాఖండిగా చెప్పేస్తుంద‌ట‌. ‘సెల్ఫీలు దిగాలా... వ‌ద్దా... అనే నా ఇష్టం. అడిగిన వారంద‌రితో న‌వ్వుతూ ఫోటోలు దిగ‌డం నా డ్యూటీ కాదు. నాకు న‌చ్చ‌న‌ప్పుడు సెల్ఫీలు దిగ‌ను...’ అంటూ గ‌ట్టిగానే చెబుతోంది రాధికా. అంతేకాదు విజ‌యాలు వ‌చ్చిన త‌ర్వాతే త‌న‌ని వెతుక్కుంటూ వ‌స్తున్న వారంటే త‌న‌కి ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదంటూ స్ప‌ష్టం చేసింది.

ఉన్న‌ది ఉన్న‌ట్టుగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే ఫైర్ బ్రాండ్ లాంటి రాధికా ఆప్టే... బాలీవుడ్లో కాబ‌ట్టి ఇన్నాళ్ల‌పాటు హీరోయిన్ గా కొన‌సాగుతోంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు సౌత్ జ‌నాలు. ఆమె సైఫ్ ఆలీ ఖాన్ తో క‌లిసి న‌టించిన ‘బ‌జార్‌’ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.