Begin typing your search above and press return to search.
రాధికా క్రేజీ సెల్ఫీ- వైరల్ పిక్
By: Tupaki Desk | 24 Jan 2018 9:54 AM GMTసామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా సెల్ఫీల మీద మోజు రోజు రోజుకి పెరుగుతోంది తప్ప ఎంతకీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే కొన్ని చైనా కంపెనీలు ఏకంగా సెల్ఫీ ఎక్స్ పర్ట్ లాంటి పేర్లతో అత్యధిక రెజుల్యుషన్ కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ భరత్ నగర్ దగ్గర ఉన్న ఒక రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టడం కోసం నిలుచున్నాడు. తనకు ఏమి కాదనే మొండి ధైర్యంతో ట్రైన్ డ్రైవర్ హారన్ కొడుతున్నా వినిపించుకోకుండా అలాగే ఉండి తీరా ట్రైన్ తనను కొట్టాక ఆసుపత్రిలో తీవ్ర గాయాల మధ్య కొనఊపిరితో బ్రతికిపోయాడు. ఇలా సెల్ఫీల మీద మోజుతో రకరకాల విన్యాసాలు చేస్తున్న వాళ్ళకు కొదవే లేదు.
కాని సెల్ఫీల పేరుతో ఎవరైనా క్రేజీ హీరొయిన్ ఏదైనా చేస్తే మాత్రం అది క్షణాల్లో వైరల్ అవుతుంది. బోల్డ్ హీరొయిన్ గా పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే తీసుకున్న ఒక సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఒక బల్లిని తన బుగ్గలపై ఉంచుకుని దాన్ని తన నాలుకతో తాకించే ప్రయత్నం చేస్తూ ఒక విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన రాధికా ఆప్టే అది నిజమైన బల్లి అవునో కాదో చెప్పలేదు కాని అధికశాతం తన ధైర్యాన్ని మెచ్చుకుంటూనే సెల్ఫీ కోసం బల్లి తప్ప ఇంకేది దొరకలేదా అని కామెంట్ చేస్తున్నారు.
సాధారణంగా బల్లిని భారతీయులు అపశకునంగా భావిస్తారు. పొరపాటున దాన్ని తాకినా లేక తమ మీద పడినా కనీసం స్నానం చేయనిదే కుదుటపడలేని వాళ్ళు కోట్లలో ఉన్నారు. బల్లి తగిలితే దోషం అనుకునే వాళ్ళు కంచి కి పోయి బంగారు బల్లిని తాకి దోష పరిహారం చేసుకోవడం ఇప్పటికీ ఉంది. అలాంటిది బల్లిని ఏకంగా చెంపలపై పెట్టుకోవడమే కాక దాన్ని చుంబించే ప్రయత్నం చేయటం ఏకంగా సెల్ఫీ రూపంలో పెట్టడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అది బొమ్మ బల్లి అయినా కూడా ఇలా చేయొచ్చు అని సమర్ధించడానికి మనసు రావడం కష్టమే. రాధికా ఆప్టే స్టైలే వేరు కాబట్టి చూసి ఎంజాయ్ చేయటమే. తప్పదు.