Begin typing your search above and press return to search.

మ్యాగజైన్ షూట్ తో ఫిదా చేస్తున్న లెజెండ్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   22 March 2021 3:30 PM GMT
మ్యాగజైన్ షూట్ తో ఫిదా చేస్తున్న లెజెండ్ హీరోయిన్..!
X
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ డ్రామాలతో పాటు రొమాంటిక్, కామెడీ ఇలా సినిమాలు ఏవైనా ఈజీగా చేయడానికి సిద్ధంగా ఉంటోంది చెన్నై బ్యూటీ రాధికా ఆప్టే. రాధికా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి అన్ని పాత్రలకు ఓకే చెబుతూ.. ఆమెకు స్కోప్ ఉందని అనిపిస్తే చేసేస్తోంది. రాధికాకు చాలా డేర్. తను చేసిన పాత్రలలో తను తప్ప వేరే హీరోయిన్ సెట్ అవ్వదు అనేలా ఇరగదీస్తుంది. నిజానికి సినిమాలే కాదు సోషల్ మీడియాలో రాధిక చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. చెన్నైలో పుట్టినప్పటికీ పూణేలోని ఫెర్గ్యూసన్ కాలేజీ నుండి ఎకనామిక్స్ అండ్ మాథెమాటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పట్టాపొందింది. చాలా ఏళ్ళు కథక్ నాట్యంలో శిక్షణ కూడా తీసుకుందట. అనంతరం థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర సిరీస్ సినిమాలతో అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత ధోనీ, లెజెండ్, లయన్ సినిమాలలో సింపుల్ గా కనిపించి తన పరిధి మేరకు మెప్పించింది. తెలుగులో రాధికా చేసిన సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ అమ్మడు ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కాలుమోపిందో.. అప్పటినుండి తన గ్లామర్ షోకు అడ్డుతెరలు తొలగించింది. ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న రాధికా.. అప్పుడప్పుడు మతులు చెడిపోయే రేంజిలో ఫోటోషూట్స్ చేస్తోంది. తాజాగా అమ్మడు ఫెమినా మార్చ్ 2021 మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలో రాధికాను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అద్భుతమైన కలర్ ఫుల్ లైన్ డిజైనింగ్స్ తో రాధికా డ్రెస్ డిజైన్ చేశారు. అలాగే అందమైన హెయిర్ స్టైల్ తో ఆర్టిఫిషల్ ఫ్లవర్స్ పొదిగిన డ్రెస్సులో అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం రాధికా మ్యాగజైన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.