Begin typing your search above and press return to search.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్‌ కు 'లెజెండ్' హీరోయిన్ మద్ధతు...!

By:  Tupaki Desk   |   21 Sep 2020 8:50 AM GMT
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్‌ కు లెజెండ్ హీరోయిన్ మద్ధతు...!
X
బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ హీరోయిన్ పాయల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు బాలీవుడ్‌ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారానికి ఇప్పుడు మళ్ళీ క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం యాడ్ అయింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనురాగ్‌ కశ్యప్‌ ని అరెస్ట్‌ చేయాలంటూ ట్విట్టర్‌ లో హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టి డిమాండ్ చేస్తున్నారు. నటి కంగనా రనౌత్ కూడా పాయల్‌ ఘోష్‌ కి మద్ధతు తెలుపుతూ 'మీ టూ' 'అరెస్ట్‌ అనురాగ్‌ కశ్యప్‌' అంటూ ట్వీట్ పెట్టింది. అయితే ఇండస్ట్రీలోని మరికొందరు మాత్రం అనురాగ్‌ కశ్యప్‌ కి సపోర్ట్ నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్ రాధికా ఆప్టే కూడా అనురాగ్‌ కశ్యప్‌ కి మద్ధతుగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ''అనురాగ్‌.. మీరు నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు. మీరు నన్ను ఇన్స్పైర్ చేసారు.. ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. మీరు ఎల్లప్పుడూ నన్ను ఈక్వల్ గా చూసారు. మనం ఒకరికొకరు కలిగి ఉన్న పరస్పర ప్రేమను, గౌరవాన్ని నేను ఎంతో ఆదరిస్తాను. నాకు మీరు తెలిసిన రోజు నుండి నేను ఎల్లప్పుడూ మీ సమక్షంలో ఎంతో భద్రంగా ఉన్నాను. మీరు ఎప్పటికీ నా నమ్మకమైన ఫ్రెండ్. లవ్ యా..'' అని పోస్ట్ చేసింది రాధికా ఆప్టే. దీనికి అనురాగ్‌ కశ్యప్‌ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా, హీరోయిన్ తాప్సీ కూడా అనురాగ్‌ కశ్యప్‌ కి సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. "నువ్వొక పెద్ద స్త్రీ వాదివి. త్వరలోనే నిన్ను సెట్స్‌ లో చూస్తానని భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో స్త్రీ ఎంత శక్తివంతురాలో తెలియజేసేలా నువ్వొక విషయాన్ని క్రియేట్‌ చేస్తావని ఆశిస్తున్నాను" అంటూ అనురాగ్‌ కశ్యప్‌ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది.