Begin typing your search above and press return to search.

హవ్వ.. ఎంతపని చేశావ్ రాధికా!!

By:  Tupaki Desk   |   10 March 2018 5:21 AM GMT
హవ్వ.. ఎంతపని చేశావ్ రాధికా!!
X
బాలీవుడ్ హీరోయిన్లలో రాధికా ఆప్టే రూట్ ఎప్పుడూ సెపరేటే. సినిమాల్లో హోమ్లీగా.. పక్కింటమ్మాయి కనిపించే పాత్రలు ఎక్కువగా చేస్తుంది. రియల్ లైఫ్ లో మాత్రం అందాల ఆరబోతకు సరిహద్దులు లేవు అంటూ గ్లామర్ అంతా గుమ్మరిస్తుంటుంది. ఏదయినా అంశంపై ఒపీనియన్ చెప్పమంటే మనసులో మాట దాచుకోకుండా రెండు.. మూడు ముక్కల్లోనే చాలా స్ట్రాంగ్ గా బదులివ్వడం రాధికా ఆప్టే స్పెషాలిటీ.

ఈమధ్య రాధిక గోవా బీచ్ లన్నీ అలా సరదాగా తిరిగొచ్చింది. ఈ సందర్భంగా బీచ్ లలో బికినీలతో దిగిన ఫోజులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాల్లో చీరకట్టుతో సిగ్గుపడుతూ కనిపించే ఈ భామ ఒక్కసారిగా ఈ రేంజిలో అందాలు ఆరబోయడం చూసి అభిమానులు తట్టుకోలేక ఆమెపై నెగిటివ్ కామెంట్లతో దాడి మొదలెట్టారు. వీటినేం లెక్కచేయనంటోంది రాధిక. ‘‘నా గురించి నెగిటివ్ గా ప్రచారం జరుగుతున్న విషయం వేరేవాళ్లు చెప్పేదాకా నాకు తెలియదు. అయినా నేను బీచ్ కు వెళ్తే శారీ కట్టుకుని వెళ్లాలని కోరుకంటున్నారా ఏంటి జనాలు? మరీ అతిగాకపోతే. నాకెవరో తెలియని వ్యక్తుల కామెంట్లను నేను లెక్క చేయను అంటూ తేల్చిచెప్పేసింది.

రాధిక ఆప్టే రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్యాడ్ మాన్ సినిమాలో నటించింది. అందులో ఆమె పల్లెటూరులో పుట్టి పెరిగిన అమాయకురాలైన మహిళ రోల్ చేసింది. శానిటరీ నాప్కిన్స్ వాడమంటేనే భయపడిపోయిన భార్య పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాంటి రాధికను ఒక్కసారి బికినీలో చూసేసరికి కొందరు అభిమానులు ఓవర్ గా రియాక్ట్ అయిపోయారు. కాని రియల్ లైఫ్ లో మాత్రం రాధిక టూ మోడరన్ అండ్ టూ హాట్.