Begin typing your search above and press return to search.

హాట్‌ బ్యూటీ పంతులమ్మ అయ్యేదట

By:  Tupaki Desk   |   26 May 2019 6:37 AM GMT
హాట్‌ బ్యూటీ పంతులమ్మ అయ్యేదట
X
సౌత్‌ - నార్త్‌ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో నటించిన ఈ అమ్మడు - తెలుగులో బాలకృష్ణ తో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు నార్త్‌ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. బాలీవుడ్‌ సినిమాలతో పాటు హాలీవుడ్‌ లో కూడా ఈమె నటించింది. బాలీవుడ్‌ - హాలీవుడ్‌ సినిమాలతో పాటు అంతర్జాతీయ స్థాయి వెబ్‌ సిరీస్‌ లలో కూడా ఈమె నటించడం జరుగుతోంది.

ఈమె నటించిన వెబ్‌ సిరీస్‌ లతో మంచి గుర్తింపు రావడంతో తాజాగా మరోసారి హాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. హాలీవుడ్‌ లో నటించేందుకు సిద్దం అవుతున్న ఈ అమ్మడు తాజాగా ఒకానొక సందర్బంలో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి రానట్లయితే టీచర్‌ వృత్తిని చేపట్టేదాన్ని అంది. నాకు చిన్నప్పటి నుండి కూడా మ్యాథ్స్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను మ్యాథ్స్‌ లో ఉన్నత చదువులు చదివి మ్యాథ్స్‌ టీచర్‌ గా సెటిల్‌ అయ్యేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

మ్యాథ్స్‌ టీచర్‌ గా అవకాశం లేకుంటే వైల్డ్‌ లైఫ్‌ రంగంపై కూడా నాకు ఆసక్తి ఉండేది. ఆ రంగంలో అయినా సెటిల్‌ అయ్యేదాన్ని అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. ఇప్పుడు హీరోయిన్‌ గా ఇంతటి గుర్తింపు దక్కించుకున్న తర్వాత ఎవరైనా ఇలాంటి మాటలే చెబుతారు. రాధిక కూడా అలాగే చెబుతుందని నెటిజన్స్‌ అంటున్నారు. బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ లో కూడా ప్రస్తుతం దూసుకు పోతున్న ఈ అమ్మడు పూర్తి సంతృప్తికరమైన కెరీర్‌ ను కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.