Begin typing your search above and press return to search.
చిరిగిన చీర కట్టుకుని పెళ్లి చేసుకుందట!
By: Tupaki Desk | 17 Oct 2019 9:28 AM GMTసెలబ్రెటీస్ కాస్ట్యూమ్స్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడ్రన్ డ్రస్ లో అందరిలోకి తామే ఎక్కువ ఆకర్షనీయంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన సందర్బాల్లో అయితే లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక వెడ్డింగ్ అంటే సెలబ్రెటీలు లక్షల రూపాయలు డ్రస్ లకు ఖర్చు చేస్తారు. పెళ్లికి హాజరు అయ్యే వారే ఎంతగానో ప్రత్యేకమైన డ్రస్ లను వేసుకుంటే ఇక వెడ్డింగ్ చేసుకునే వారు మరెంత ప్రత్యేకంగా ఉండాలనుకుంటారో చెప్పనక్కర్లేదు.
హీరోయిన్స్ పెళ్లి వేడుకల్లో ఎక్కువ శాతం వారి డ్రస్ ల గురించే చర్చ జరుగుతుంది. కాని బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే పెళ్లి సమయంలో మాత్రం కట్టుకున్న చీర చిరిగి పోయి ఉందట. ఆమె తన అమ్మమ్మ చీరను సెంటిమెంట్ గా కట్టుకుని పెళ్లి చేసుకుందట. ఆ చీరకు ఎన్నో చిరుగులు ఉన్నా కూడా వాటిని కవర్ చేయకుండానే అమ్మమ్మ జ్ఞాపకార్థం అంటూ ఆ చీర కట్టుకుని రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుంది. 2012లో బ్రిటీష్ మ్యుజీషియన్ టేలర్ ను పెళ్లి చేసుకున్న రాధిక ఆప్టే పెళ్లి తర్వాత అతడితో అప్పుడప్పుడు కలుస్తూ ఎక్కువ శాతం ఇండియాలోనే ఉంటుంది.
ఇండియాలో హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న రాధిక ఆప్టే బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు. నార్త్.. సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకు పోతున్న రాధిక ఆప్టే వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంటుంది. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా కూడా నటించేందుకు ఒప్పుకునే రాధిక ఆప్టే చాలా సింపుల్ అండ్ స్వీ అంటూ ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే ఆమె తన పెళ్లిని సింపుల్ గా రిజిస్ట్రర్ ఆఫీస్ లో చేసుకుంది. అలాగే పెళ్లికి అమ్మమ్మ జ్ఞాపకార్థం ఆమె చిరిగి పోయిన చీరను కట్టుకుంది. ఇప్పటికి కూడా ఆ చీరను ముఖ్యమైన సందర్బాల్లో కట్టుకుంటుందట. ఎమోషన్స్ కు బాగా విలవనిచ్చే రాధిక ఆప్టే మరి ఎందుకు అంత బోల్డ్ గా నటిస్తుందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.