Begin typing your search above and press return to search.
రాధిక అడిగితే చిరు ఏమన్నాడో... తెలుసా?!
By: Tupaki Desk | 6 Dec 2015 5:30 PM GMTచిరు 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ... అందరికళ్లూ ఆ సినిమాపైనే. పెద్ద పెద్ద నటులు సైతం ఆ సినిమాలో మేం ఓ చిన్న పాత్ర చేసినా చాలు అంటున్నారు. చిరు రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం, అదొక మైలురాయిలాంటి 150వ సినిమా కావడమే అందుకు కారణం. చెప్పుకోవడానికి అదొక గుర్తుగా ఉంటుంది కదా అనేది ఆయా నటుల అభిప్రాయం. అయితే అలా చిరు సినిమాలో నటించాలన్న కోరికని తాజాగా మరో నటి కూడా వెలిబుచ్చింది. ఆమె ఎవరో కాదు... చిరుతో బోలెడన్ని సినిమాలు చేసిన రాధిక. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ పెయిర్ కూడా.
రాధిక తెలుగు తెరపై కనిపించక చాలా రోజులైంది. కానీ వీలైనంత త్వరగా తెలుగులో నటించాలన్నది ఆమె కోరిక. ఆ అవకాశం ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నానని చెబుతోంది. ఇటీవల ఓ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ లో రాధిక మాట్లాడుతూ తన కోరికని బయటపెట్టింది. ఇక రేపో మాపో మన దర్శకులు మంచి అవకాశంతో ఆమె దగ్గరికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాధికకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. నిన్నటితరం ప్రేక్షకులు ఇప్పటికీ రాధికని తలచుకుంటుంటారు.
అయితే తెలుగు దర్శకులు తన దగ్గరికి రావడం కంటే ముందుగానే రాధిక ఇటీవల మీ 150వ సినిమాలో నాకో అవకాశం ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవిని అడిగిందట. అందుకు చిరు ఏం ఆన్సర్ ఇచ్చుంటాడో మీరు ఊహించండి? `మంచి విలన్ పాత్ర ఏదైనా ఉంటే చూద్దాం లే` అని నవ్వేశాడట. ఆ విషయాన్ని స్వయంగా రాధికనే చెప్పింది. విలన్ పాత్ర కాదు బాబూ... నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలంతే అని రాధిక చెప్పిందట. నిజంగానే రాధిక ఇదివరకు చిరు సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించింది. రౌడీరాణి తరహాలో చిరుని సైతం డామినేట్ చేసే పాత్రల్లో కనిపించింది. అందుకే చిరు ఆ మాటన్నాడన్నమాట. కలిసి బోలెడన్ని సినిమాల్లో నటించిన వీళ్లిద్దరి మధ్య మంచి చనువుంది. అందుకే తరుచుగా ఒకరినొకరు కలుసుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఒకరికపై ఒకరు జోకులేసుకుంటుంటారన్నమాట.