Begin typing your search above and press return to search.
శ్రీలంక బ్లాస్ట్: సీనియర్ నటి గ్రేట్ ఎస్కేప్
By: Tupaki Desk | 21 April 2019 10:24 AM GMTశ్రీలంక రాజధాని కొలంబో బాంబ్ బ్లాస్ట్ కలకలం ప్రస్తుతం ప్రపంచవ్యప్తంగా హాట్ టాపిక్. నేటి ఉదయం 8.30 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకూ 256 మంది మరణం పాలవ్వగా.. 500 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దుర్ఘటనపై అటు కోలీవుడ్ .. ఇటు టాలీవుడ్ లోనూ సెలబ్రిటీల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ ఘటనను ఖండించడమే గాక.. అశువులు బాసిన వారికి .. క్షతగాత్రులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ బ్లాస్ట్ వార్త వినగానే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ .. ``శ్రీలంక ఉదంతంలో బాధితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. దేవుని ప్రార్థిస్తున్నాను`` అని ఫేస్ బుక్ లో సందేశం పంపారు.
ఈ బ్లాస్ట్స్ గురించి మరో బ్లాస్ట్ అయ్యే వార్తను సీనియర్ నటి రాధిక ట్విట్టర్ లో వెల్లడించడం షాకిచ్చింది. ``ఓ మై గాడ్! శ్రీలంకలో బాంబ్ పేలుళ్లు!! ఈ పేలుళ్లకు క్షణకాలం ముందే అదే సిన్నామన్ గ్రాండ్ హోటల్ నుంచి మేం బయటపడ్డాను. దీనిని నమ్మడం షాకింగ్ గా ఉంది`` అని రాధిక ట్విట్టర్ లో తెలిపారు. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగాయని చెబుతున్నారు. కొలంబోలో మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబ్ దాడులు జరిగితే... వాటిల్లో సిన్నామన్ గ్రాండ్ హోటల్ ఒకటి.
కొన్ని క్షణాలు.. నిమిషాల ముందు బాంబ్ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అన్నిటికీ ఆ దైవమే ఉన్నాడని.. ఈ సందర్భంగా రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ముంబై .. హైదరాబాద్ (గోకుల్ చాట్.. లుంబినీ పార్క్) సహా పలు నగరాల్లో బాంబ్ బ్లాస్ట్స్ జరిగినప్పుడు సెలబ్రిటీ ప్రపంచం పెద్ద ఎత్తున ఖండించింది. ఈసారి కూడా అదే తీరుగా స్పందిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్.. జాక్విలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు ఈ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండించారు.