Begin typing your search above and press return to search.

హీరోయిన్ సంచ‌ల‌నంః పెళ్లి అనేది ట్రాష్‌.. కేవ‌లం దానికోస‌మే భ‌ర్తను చేసుకున్నా!

By:  Tupaki Desk   |   30 March 2021 8:30 AM GMT
హీరోయిన్ సంచ‌ల‌నంః పెళ్లి అనేది ట్రాష్‌.. కేవ‌లం దానికోస‌మే భ‌ర్తను చేసుకున్నా!
X
‘పెళ్లిపై నాకు న‌మ్మ‌కం లేదు.. కేవలం అవసరం కోసమే భర్తను చేసుకున్నాను’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది హీరోయిన్ రాధికా ఆప్టే. హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ అమ్మ‌డు.. న‌గ్నం కూడా న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డింది. తాజాగా.. పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను వివాహ వ్య‌వ‌స్థ‌ను న‌మ్మ‌ను అని ప్ర‌క‌టించింది.

అయితే.. ఈమె గ‌తంలోనే పెళ్లి చేసుకోవ‌డం విశేషం. అది కూడా బ్రిట‌న్ మ్యూజిషియ‌న్ బెనెడిక్ట్ టేల‌ర్ ను కొన్నేళ్ల క్రితంపెళ్లి చేసుకుంది రాధిక‌. అయితే.. భ‌ర్త అక్క‌డ త‌న‌ప‌ని తాను చూసుకుంటూ ఉండ‌గా.. ఇండియాలో ఈమె ప‌ని ఈమె చేసుకుంటోంది. అప్పుడ‌ప్పుడూ వెళ్లి భ‌ర్త వ‌ద్ద కొన్ని రోజులు ఉండి వ‌స్తూ ఉంటుంది. రాధిక‌.

త‌న జీవితానికి హ‌ద్దులు లేవ‌ని చెప్పిన ఆప్టే.. తామిద్ద‌రం క‌లిసి జీవించాల‌ని అనుకుని ఒక్క‌ట‌య్యామని చెప్పింది. కానీ.. పెళ్లిపై మాత్రం త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని చెబుతోంది. ఇక‌, సినిమాల్లో త‌న‌కు న‌గ్నంగా న‌టించ‌డానికి ఇబ్బంది లేద‌ని, పాత్ర‌కోసం ఎంత దూర‌మైనా వెళ్తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మ‌రి, న‌మ్మ‌కం లేని పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చింది అంటే.. రాధికా చెప్పే స‌మాధానం వింటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కేవ‌లం వీసా కోస‌మే పెళ్లి చేసుకున్న‌ట్టు తెలిపింది రాధిక‌. విదేశీ అబ్బాయిని వివాహం చేసుకున్నది కూడా అందుకేన‌ని చెప్ప‌డం విశేషం. మొత్తానికి.. వీసా కోసం పెళ్లి చేసుకున్న మొద‌టి న‌టి ఈమే కావొచ్చు!