Begin typing your search above and press return to search.
హీరోయిన్ కూతురికి క్రికెటర్ తో పెళ్లి
By: Tupaki Desk | 12 Sep 2015 3:30 PM GMTక్రికెటర్లు సినిమా హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఐతే హీరోయిన్లను చేసుకోవడం మామూలే కానీ.. ఓ హీరోయిన్ కూతుర్ని పెళ్లాడటం మాత్రం కొత్తే. కర్ణాటక క్రికెటర్ అభిమన్యు మిథున్ ఈ బాటలో నడుస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి.. కొన్నేళ్లుగా టీవీ రంగంలో హవా సాగిస్తున్న రాధిక తన కూతురు రయానెను మిథున్ కిచ్చి పెళ్లి చేయబోతోంది.
మిథున్ బెంగళూరువాడు - రయానె చెన్నై అమ్మాయి. మరి ఇద్దరికీ ఎలా బంధం మొదలైందో కానీ.. కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల నుంచి అంగీకారం కూడా లభించడంతో పెళ్లికి మార్గం సుగగమైంది. ఈ నెల 23న చెన్నైలో మిథున్, రయానెల నిశ్చితార్థం జరగబోతోంది. రయానె రాధిక మొదటి భర్త కూతురు. రాధిక తర్వాత హీరో శరత్ కుమార్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
కర్ణాటక క్రికెటరైన మిథున్.. భారత జట్టుకు కూడా ఆడాడు. నాలుగు టెస్టుల్లో - ఐదు వన్డేల్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఐతే పెద్దగా రాణించకపోవడంతో మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐతే ఐపీఎల్ లో అతడికి మంచి డిమాండే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శనే చేశాడు.