Begin typing your search above and press return to search.

హృతిక్ తండ్రి భయమే నిజమైందిగా..

By:  Tupaki Desk   |   31 Jan 2017 9:45 AM GMT
హృతిక్ తండ్రి భయమే నిజమైందిగా..
X
బాలీవుడ్లో రిలీజ్ డేట్ల విషయంలో అనధికార అగ్రిమెంట్లు నడుస్తుంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడకూడదన్న నియమం ఉంటుంది. ఇందుకోసం చాలా ముందుగానే.. ఏడాది రెండేళ్లు అడ్వాన్సుగా కూడా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటారు. సినిమా ప్రారంభమైనపుడే రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. స్టార్ హీరోలు ఒకరితో ఒకరు క్లాష్ అయితే పెద్ద గొడవైపోతుంది. కాబట్టి చాలా వరకు ఈ పోటీని అవాయిడ్ చేస్తుంటారు.

కానీ ఈ రిపబ్లిక్ డే వీకెండ్లో పోటీ అనివార్యమైంది. హృతిక్ రోషన్ సినిమా ‘కాబిల్’ ఏడాది కిందటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ గత ఏడాదే రావాల్సిన షారుఖ్ ఖాన్ మూవీ ‘రయీస్’ అనుకోకుండా వాయిదా పడి.. ‘కాబిల్’తో పోటీకి దిగింది. దీనిపై హృతిక్.. ‘కాబిల్’ నిర్మాత అయిన రాకేష్ రోషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాకేష్ అయితే.. థియేటర్ల కేటాయింపులో షారుఖ్ మోసం చేశాడని.. దీని వల్ల తనకు రూ.150 కోట్ల దాకా ఆదాయంలో కోత పడుతోందని అన్నాడు.

ఇప్పుడు ‘కాబిల్’కు వచ్చిన వసూళ్లు చూస్తుంటే రాకేష్ భయమే నిజమైనట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం షారుఖ్ మూవీకే బాగా వచ్చాయి. ఆ చిత్రం ఇండియా వరకే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. విదేశాల్లో రూ.50 కోట్లకు పైనే వసూలు చేసింది. కానీ ‘కాబిల్’ ఇండియాలో రూ.60 కోట్లు.. విదేశాల్లో పాతిక కోట్లు మాత్రమే వసూలు చేసింది. ‘రయీస్’ రాకపోయి ఉంటే కచ్చితంగా ‘కాబిల్’ కలెక్షన్లు మెరుగ్గా ఉండేవి. ఈపాటికే ఇండియా వసూళ్లు రూ.100 కోట్లకు చేరువై ఉండేవి. మొత్తానికి హృతిక్ సినిమాకు షారుఖ్ పెద్ద పంచ్ ఇచ్చాడు ‘రయీస్’తో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/