Begin typing your search above and press return to search.

ఈ ప్రమోషనల్ ఐడియా కొత్తగా ఉందే

By:  Tupaki Desk   |   17 Jan 2017 5:22 PM GMT
ఈ ప్రమోషనల్ ఐడియా కొత్తగా ఉందే
X
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన కొత్త సినిమా రాయీస్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రాయీస్ రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో.. ప్రమోషన్స్ విషయంలో గేర్ మార్చింది మూవీ యూనిట్.

ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా షారూక్ అండ్ టీం కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతోంది. ఈ మూవీలో షారూక్ ఓ స్పెషల్ కళ్లజోడుతో ఉన్న లుక్ విపరీతంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. షారూక్ లుక్ నే డిఫరెంట్ గా మార్చేసిన ఈ కళ్లజోడునే ఇప్పుడు ప్రమోషన్స్ కు వాడేస్తోంది మూవీ యూనిట్. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కు.. రాయీస్ మూవీలో షారూక్ ఉపయోగించన లాంటి కళ్లజోడు లాంటిదే ఒకటి అందింది. దీనిపై స్పందిస్తూ.. ఆ కళ్లజోడును.. బాక్స్ ను ఫోటో తీసి షేర్ చేసిన తరణ్ ఆదర్శ్ 'రాయీస్ ప్రమోషన్ కోసం షారూక్ ఖాన్.. ఎక్సెల్ లు వినూత్న ఆలోచనలు చేస్తూన్నాయి. రీసెంట్ గా బాగా పాపులర్ అయిన ఎస్ఆర్కే స్పెక్స్ అందుకున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పటికే షారూక్ ధరించిన ఆ స్పెక్టకిల్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. 'బ్యాటరీ నహీ బోల్నేకా.. రాయీస్' అని రాసి ఉన్న బాక్స్ ను అందిస్తూ.. ప్రచారం చేస్తోంది రాయీస్ యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/