Begin typing your search above and press return to search.
అదిరింది కొత్త ట్రైలర్
By: Tupaki Desk | 7 Dec 2016 11:17 AM GMTఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓ సినిమా ఇంకో యాభై రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అదే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘రయీస్’. ఎప్పుడో ఏడాది కిందటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి.. షారుఖ్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం తీసుకొచ్చాడు దర్శకుడు రాహుల్ డోలాకియా. ఐతే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ఈ ఏడాది మధ్యలోనే రావాల్సిన ‘రాయీస్’ వచ్చే ఏడాది జనవరి 25కు మారింది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇవాళ ‘రాయీస్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంది ట్రైలర్. గ్యాంగ్ స్టర్ పాత్రలో షారుఖ్ లుక్.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. నటన.. డైలాగ్ డెలివరీ అన్నీ కూడా అదిరిపోయాయి. 70ల్లో హవా సాగించిన గుజరాతీ గ్యాంగ్ స్టర్ రాయీస్ ఖాన్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు రాహుల్ డోలాకియా. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దినట్లున్నాడు. ఈ సినిమా కోసం కొంచెం పెక్యులర్ వాయిస్ తో డైలాగులు పలికాడు షారుఖ్. గ్యాంగ్ స్టర్ అయిన కథానాయకుడిని వెంటాడే పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖి కనిపిస్తున్నాడు.
కళ్లు చెదిరే విజువల్స్.. యాక్షన్ దృశ్యాలు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశంలోనూ భారీతనం కనిపిస్తోంది. షారుఖ్ లో ఒక వింటేజ్ లుక్ కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఐతే హీరోయిన్ గా నటించిన మహిరా ఖాన్ అంత ఆకర్షణీయంగా ఏమీ లేదు. ముందు ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. దీంతో హృతిక్ రోషన్ తన ‘కాబిల్’ సినిమాను 25కు ప్రిపోన్ చేసుకున్నాడు. ఐతే షారుఖ్ మూవీ కూడా 25కే రానున్నట్లు ట్రైలర్లో అనౌన్స్ చేయడం విశేషం.