Begin typing your search above and press return to search.

అనుష్క‌తో లారెన్స్‌.. క‌ష్ట‌మేనేమో?!

By:  Tupaki Desk   |   18 March 2016 7:30 AM GMT
అనుష్క‌తో లారెన్స్‌.. క‌ష్ట‌మేనేమో?!
X
అప్ప‌ట్లో `రెబ‌ల్` సినిమాకోస‌మ‌ని అనుష్క‌ - లారెన్స్ క‌లిసి కొన్నాళ్లు ప‌నిచేశారు. ఏమైందో తెలియ‌దు కానీ... మ‌ధ్య‌లోనే అనుష్క ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది. ఆ ప్లేస్‌ లోకి త‌మ‌న్నాని తీసుకొన్నారు. అనుష్క‌ - ప్ర‌భాస్‌ ల‌పై కొన్ని స‌న్నివేశాలు తీసిన‌ప్ప‌టికీ అనుష్క మాత్రం ఆ ప్రాజెక్ట్‌ లో ఇమ‌డ‌లేక‌పోయింది. దీంతో త‌మ‌న్నా ఎంట్రీ ఇచ్చాక మ‌ళ్లీ ఆ స‌న్నివేశాల్ని రీషూట్ చేశారు. అప్పట్లో లారెన్స్ కీ - అనుష్క‌కీ మ‌ధ్య వార్ జ‌రిగింద‌ని, అందుకే అనుష్క త‌ప్పుకుంద‌ని... ఈ విష‌యంపై నాగార్జున ద‌గ్గ‌ర కూడా పంచాయ‌తీ కూడా జ‌రిగింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాట్లాడుకున్నాయి. అదే లాస్ట్‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ లారెన్స్‌ - అనుష్క క‌లిసి ప‌నిచేసిందే లేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ క‌ల‌వ‌బోతున్నార‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ జ‌నాలు మాట్లాడుకుంటున్నారు.

అస‌లే బిజీ బిజీగా ఉంది అనుష్క. ఈ ద‌శ‌లో అది కూడా లారెన్స్‌ తో క‌లిసి న‌టిస్తుందా అన్న‌ది సందేహమే. కానీ ఆ ప్రాజెక్టు ఉండొచ్చ‌న్న ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. కన్నడంలో శివ రాజ్ కుమార్ - వేదిక కాంబినేషన్ లో శివ‌లింగ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు పి. వాసు. హారర్ థ్రిల్లర్‌ గా వ‌చ్చిన ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అయితే ఆ సినిమాని తెలుగు - తమిళ భాష‌ల్లో రీమేక్ చేయాలని పి. వాసు అనుకుంటున్నారట. తెలుగు - త‌మిళ్ అంటే రెండు భాష‌ల్లో మార్కెట్ ఉన్న అనుష్క - లారెన్స్ అయితే బాగుంటుంద‌నేది వాసు అభిప్రాయ‌మ‌ట‌.

`చంద్రముఖి 2` పేరుతో తెర‌కెక్కించాల‌నుకుంటున్న ఆ సినిమాలో మ‌రి అనుష్క‌, లారెన్స్ క‌లిసి న‌టిస్తారా లేదా అనేది చూడాలి.