Begin typing your search above and press return to search.
లారెన్స్..ఆలస్యమైనా అద్భుతమే!
By: Tupaki Desk | 9 April 2020 2:06 PM GMTచిన్న స్థాయి నుంచి ఒక ప్రముఖ దర్శకుడిగా - నృత్యకారుడిగా - నటుడిగా ఎదిగిన లారెన్స్ మనసున్నోడు. అతడిని సినిమా కర్ణుడు అనొచ్చు. తన సంపాదనను తరచుగా దానం చేస్తుంటారు లారెన్స్. ఎన్నో రకాలుగా ఇతరులను ఆదుకుంటూ ఉంటారు. అలాంటి లారెన్స్ ఇంతవరకు విరాళం ప్రకటించకపోయేటప్పటికి చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ లారెన్స్ ఇలాంటి విరాళాలు ఇవ్వడానికి ఎవరి నుంచో స్ఫూర్తి పొందరు. అయితే మరి చేతికందాల్సిన డబ్బు ఆలస్యమైందేమో. అందుకే ఆలస్యంగా స్పందించారు.
తాజాగా కరోనా నేపథ్యంలో 3 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి సంచలనం అయ్యారు లారెన్స్. దీనిని 6 విభాాగాలుగా విభజించారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం... డ్యాన్స్. అందుకే డ్యాన్సర్స్ యూనియన్ కి 50 లక్షలు విరాళం ఇచ్చారు. సినీ కార్మికుల సంఘానికి మరో 50 లక్షలు ప్రకటించారు. తాను నివసించే ప్రాంతంలోని వికలాంగులు - పేదల కోసం కోటి రూపాయలు కేటాయించారు. అతను రాయపురంలో నివసిస్తారు. అక్కడ పేదలకు అన్నం వసతి అందించడానికి దీనిని ఖర్చుపెట్టనున్నారు.
మిగిలిన కోటి రూపాయల్లో 50 లక్షల పీఎం కేర్స్ ఫండ్ కి - మరో 50 లక్షల తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి కేటాయించారు. లారెన్స్ కేవలం విరాళం ఇచ్చి చేతులు దులుపుకోకుండా తాను స్వయంగా తన ప్రాంతంలో సేవ చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతైనా మన డ్యాన్స్ మాస్టర్ ది పెద్ద మనసే !