Begin typing your search above and press return to search.
ఇలా లారెన్స్ మాత్రమే చేయగలడు
By: Tupaki Desk | 2 April 2017 10:21 AM GMTరోడ్డు మీదో.. ఎక్కడైనా రైల్లోనో హిజ్రా కనిపిస్తే చాలు చిరాకు పడిపోతాం. వాళ్లు ఎప్పుడెప్పుడు మన దగ్గర్నుంచి వెళ్లిపోతారా అని అసహనానికి గురవుతాం. డబ్బుల కోసం వాళ్లు కొంచెం దౌర్జన్యంగా వ్యవహరించే మాట వాస్తవమే కానీ.. జనాలకు వాళ్ల మీద చాలా చిన్న చూపు ఉండటం.. వాళ్లను అసహ్యించుకోవడం కామన్. ఐతే రాఘవ లారెన్స్ మాత్రం హిజ్రాల మీద చాలా జాలి చూపిస్తాడు. వాళ్లకు అండగా నిలుస్తుంటాడు. చెన్నైలో హిజ్రాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు లారెన్స్. సేవా కార్యక్రమాల కోసం అతను ఏర్పాటు చేసిన టీంలోనూ కొందరు హిజ్రాలుండటం విశేషం.
‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్రను ఎంత బాగా చూపించాడో.. వాళ్ల ఆవేదనను కళ్లకు కట్టేలా చూపించి ఎలా కదిలించాడో తెలిసిందే. తాజాగా హిజ్రాల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధినే ఏర్పాటు చేశాడు లారెన్స్. తన కొత్త సినిమా ‘శివలింగ’ వసూళ్ల నుంచి తనకు వచ్చే వాటాలో కొంత శాతం హిజ్రాల నిధికి కేటాయించబోతున్నట్లు చెప్పాడు లారెన్స్. ఆ డబ్బులతో హిజ్రాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని.. భవిష్యత్తులోనూ వారి కోసం విరాళాలు ఇస్తానని ప్రకటించాడు లారెన్స్. హిజ్రాలు కూడా మనలాగే మనుషులని వారిని చిన్నచూపు చూడటం.. అసహ్యించుకోవడం మానుకోవాలని లారెన్స్ పిలుపునిచ్చాడు. ఇలా ఓ సినీ హీరో హిజ్రాల కోసం నడుం బిగించడం అరుదైన విషయం. లారెన్స్ మాత్రమే ఇలా చేయగలడు. అతను అనారోగ్యంతో బాధ పడుతున్న పేద కుటుంబాల పిల్లలకు వందకు పైగా సర్జరీలు చేయించడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/