Begin typing your search above and press return to search.

సీఎం అభ్య‌ర్థి ర‌జ‌నీ అయితేనే పార్టీలో చేర‌తా!

By:  Tupaki Desk   |   14 Sep 2020 5:15 AM GMT
సీఎం అభ్య‌ర్థి ర‌జ‌నీ అయితేనే పార్టీలో చేర‌తా!
X
``ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాలుగా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాను. నా సేవా కార్య‌క్ర‌మాలు చూసిన నా శ్రేయోభిలాషులు.. అభిమానులు న‌న్ను రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని అడుగుతున్నారు. వారంద‌రికి ఈ రోజు శుభ‌వార్త చెబుతున్నాను. నా గురువు ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆయ‌న బాట‌లో న‌డుస్తా`` అంటూ రాఘ‌వ లారెన్స్ త‌ను ర‌జ‌నీ పార్టీలో చేరబోతున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే.

త‌మిళ రాజ‌కీయాల్లో ఇది హాట్ టాపిక్ ‌గా మారింది. ర‌జ‌నీ పార్టీ ప్ర‌క‌ట‌న, క్రీయ‌శీల రాజ‌కీయాల్లోకి ఇంకా ఎంట‌ర్ కాకుండానే లానెన్స్ లాంటి వాళ్లు పార్టీలో చేర‌డానికి ముందుకు వ‌స్తుండ‌గం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఈ సంద‌ర్భంగా లారెన్స్ ర‌జ‌నీకి కొత్త మెళిక పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తాను పార్టీలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించిన లారెన్స్ మ‌రో కొత్త‌ ప‌ల్ల‌వి అందుకున్నాడు.

ర‌జ‌నీ పార్టీలో చేర‌డానికి త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన లారెన్స్ కానీ పార్టీలో చేరాలంటే త‌న‌దో కండీష‌న్ అని చెబుతున్నారు. సీఎం అభ్య‌ర్థి ర‌జ‌నీ అయితేనే తాను పార్టీలో చేర‌తాన‌ని.. వేరే వ్య‌క్తి అయితే అందుకు తాను అంగీక‌రించ‌బోన‌ని స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌జ‌నీ తాను సీఎం అభ్య‌ర్థిని కాద‌ని, పార్టీలో అనుభ‌వం వున్న వ్య‌క్తిని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తాన‌ని ర‌జ‌నీ చెప్పిన విష‌యం తెలిసిందే. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న లారెన్స్ సీఎం అభ్య‌ర్థిగా ర‌జ‌నీని ఒప్పిస్తాన‌ని చెప్పార‌ట‌. ఒక వేళ ర‌జ‌నీ అంగీక‌రించ‌క‌పోతే లారెన్స్ పార్టీలో చేర‌డం క‌ష్ట‌మ‌ని, ఎప్ప‌టి లాగే త‌ను సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటాడ‌ని, మ‌రో పార్టీలో చేర‌డ‌ని త‌మిళ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.