Begin typing your search above and press return to search.
సీక్వెల్ సెంటిమెంట్ ను తిరగరాసిన దెయ్యం
By: Tupaki Desk | 5 May 2019 4:22 AM GMTసౌత్ లో డాన్స్ మాస్టర్ గానే పేరున్న లారెన్స్ దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకుని పట్టు వదలని విక్రమార్కుడిగా ముని సిరీస్ ని ఆపకుండా కంటిన్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా కాంచన 3 నెగటివ్ రివ్యూస్ ని తట్టుకుని వంద కోట్లకు పైగా గ్రాస్ ని సాధించడం ట్రేడ్ ని నివ్వెరబోయేలా చేసింది. జెర్సీ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ తెలుగు నిర్మాతకు ప్రాఫిటబుల్ వెంచర్ గా మిగలడం ఆశ్చర్యం కాక మరేమిటి.
సౌత్ లో సీక్వెల్స్ కు ఒక నెగటివ్ సెంటిమెంట్ ఉంది. ఒక బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు చేసినా లేదా ఆ పేరుకి 2-3 అంటూ నెంబర్లు జోడించుకుంటూ సినిమాలు చేసినా పెద్దగా ఆడవు. ఒక్క రాజమౌళి మాత్రమే తన బాహుబలితో దీనికి మినహాయింపుగా నిలిచాడు. వీళ్ళను పక్కన పెడితే పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్-రవితేజ-రజనీకాంత్ ఇలా అందరూ సీక్వెల్స్ తో షాకులు తిన్నవాళ్ళే
కానీ లారెన్స్ ఒక్కడూ ఈ ట్రెండ్ కి రివర్స్ లో హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు. కథ కథనాల్లో వైవిధ్యం లేకపోయినా తీసిన కంటెంట్ నే మళ్ళి తీస్తున్నాడు అనే ఫిర్యాదులు వస్తున్నా మాస్ ప్రేక్షకులు మాత్రం లారెన్స్ కే అండగా నిలుస్తున్నారు. ఇంకాస్త ఫోకస్ పెట్టి డిఫరెంట్ థీమ్ తో మసాలా సినిమాలు తీస్తే లారెన్స్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొట్టేలా ఉన్నాడు.
తెలుగులో లాభాలు ఇచ్చింది కానీ తమిళ్ లో మాత్రం దీని హక్కులు కొన్న సన్ పిక్చర్స్ సంస్థను కాంచన 3 కనక వర్షంలో ముంచెత్తింది. ఇదే ఉత్సాహంతో కాంచన రీమేక్ ని అక్షయ్ కుమార్ తో తీస్తున్న లారెన్స్ మరోవైపు కాంచన 4 స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఇప్పట్లో ఈ కాంచనల ప్రవాహానికి బ్రేకులు పడేలా లేవు