Begin typing your search above and press return to search.
కలాం అడుగుజాడల్లో లారెన్స్
By: Tupaki Desk | 4 Aug 2015 4:25 PM GMTసినిమాల గురించి పక్కనపెడితే లారెన్స్ స్వతహాగా మంచిగుణం కలవాడు. ఆ గుణంతోనే ఇప్పటికే తనవంతుగా ఓ సంస్థ ద్వారా సమాజసేవ చేస్తూ వస్తున్నాడు. తాజాగా మరోదానికి శ్రీకారం చుట్టాడు. కొద్ది రోజుల క్రితం భారతీయ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం కాలధర్మం చెందారు. ఆయన మరణించిన కలాం స్పూర్తి తో లారెన్స్ ‘కలామిన్ కల్చవుడిల్’ (కలాం అడుగుజాడల్లో) అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కోటి రూపాయలు కేటాయించాడు.
మొన్న జరిగిన తన కొత్త సినిమా ఓపెనింగ్లో తనకు అడ్వాన్స్ గా వచ్చిన కోటి రూపాయలని ఈ సంస్థకి విరాళంగా ఇచ్చేశాడు. లారెన్స్ తల్లి కూడా ముందు ఇంత మొత్తమా అని కంగారు పడ్డారట. లారెన్స్ ఈ సంస్థ ఆశయం వివరించిన తర్వాత సంతోషంగా ఒప్పుకున్నారట. ఈ సంస్థ భాద్యతలని రాఘవ ఓ ఐఏఎస్ అధికారికి అప్పగించారట. ఈ సంస్థ ద్వారా కొంతమంది చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పాలన్నది లారెన్స్ ఆశయం. ఈ సంస్థ ప్రోత్సాహంతో చదువుకున్న వారు కలాం అంతటి వారు కాలేకపోయినా లారెన్స్ లాంటి మంచి మనసు గలవారైతే చాలు. లారెన్స్ ఆశయం సిద్ధించాలని కలాం ఎప్పటికీ భారత జాతి గుండెలో కొలువై వుండాలని ఆశిస్తూ మరోసారి కలాంకు సలాం.