Begin typing your search above and press return to search.

రాఘ‌వ లారెన్స్ `రుద్ర‌న్‌` మూవీ ప్రీ లుక్‌

By:  Tupaki Desk   |   24 March 2022 4:30 PM
రాఘ‌వ లారెన్స్ `రుద్ర‌న్‌` మూవీ ప్రీ లుక్‌
X
కాంచ‌న సిరీస్ చిత్రాల‌తో హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రాఘ‌వ లారెన్స్‌. ద‌ర్శ‌కుడిగా, హీరోగా రెండు పాత్ర‌ల్ని విజ‌య‌వంతంగా పోషిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోస్ట్ చిత్రాల‌తో కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. `కాంచ‌న 3`తో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన రాఘ‌వ లారెన్స్ దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత మ‌రో సినిమాతో రాబోతున్నారు. అయితే ఈ సారి లేట్ గా వ‌చ్చినా లేటెస్ట్ గా వ‌స్తానంటూ స‌ర్ ప్రైజ్ ని ప్లాన్ చేశారు లారెన్స్‌.

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తున్న తాజా చిత్రం `రుద్ర‌న్‌`. ఈ చిత్రానికి సంబంధించిన రెండు విశేషాలున్నాయి. అందులో ఒక‌టి ఈ చిత్రానికి లారెన్స్ డైరెక్ష‌న్ చేయ‌డం లేదు. కేవ‌లం హీరోగా న‌టిస్తూ న‌ట‌న‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇక రెండో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మ‌రో సారి లారెన్స్ తో క‌లిసి శ‌ర‌త్ కుమార్ న‌టించ‌బోతున్నారు. `కాంచ‌న‌`లో టైటిల్ పాత్ర‌లో న‌టించి హిజ్రాగా ఆక‌ట్టుకున్న శ‌ర‌త్ కుమార్ ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో త‌న వంతు పాత్ర‌ని పోషించారు.

హిజ్రాని హ‌త్య చేయ‌డంతో ఆ పాత్ర ఆత్మ‌గా మారి రివేంజ్ కోసం లారెన్స్ లోకి ప్ర‌వేశిస్తుంది. ఆ త‌రువాత త‌న‌ని దారుణంగా హ‌త్య చేసిన వారిపై ఎలా ప‌గ‌తీర్చుకుంది అనే క‌థ‌తో `కాంచ‌న‌` చిత్రాన్ని చేశారు. దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌రువాత మ‌ళ్లీ లారెన్స్‌, శ‌ర‌త్ కుమార్ క‌లిసి `రుద్ర‌న్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఇద్ద‌రి మ‌ధ్య వైరం వుంటుంద‌ని, అది హోరా హోరీగా మారుతుంద‌ని చెబుతున్నారు.

ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నారు. ఆయ‌న పాత్ర ప‌వర్ ఫుల్ గా వుంటుంద‌ని, ఇప్ప‌టికే బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న స్టిల్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంద‌ని త‌మిళ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని క‌దిరేశ‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తానే స్వ‌యంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లారెన్స్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మాస్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా వుంటుంద‌ని తెలిసింది.

ఇందులో లారెన్స్ కు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టిస్తుండ‌గా తాజాగా ప్రీ లుక్ ని విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జ‌రుగుతోంది. తెలుగులోనూ ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌.