Begin typing your search above and press return to search.

ఇంత‌కీ లారెన్స్ మాస్టార్ ఏమ‌య్యారు?

By:  Tupaki Desk   |   26 Aug 2021 11:30 PM GMT
ఇంత‌కీ లారెన్స్ మాస్టార్ ఏమ‌య్యారు?
X
రాఘ‌వ లారెన్స్ న‌టించిన కాంచ‌న సిరీస్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో తెలిసిందే. కాంచ‌న 3 త‌ర్వాత అత‌డు చాలా గ్యాప్ తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అత‌డు రుద్ర‌న్ అనే చిత్రం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత కదిరేశన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా 2022 ఏప్రిల్ 14 న తమిళ నూతన సంవత్సరం రోజున ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామ‌ని లారెన్స్ బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ ఏడాది మార్చిలో పూర్తయింది. ఈ మూవీ కోసం రాఘవ లారెన్స్ కొత్త‌ హెయిర్ క‌ట్ తో కనిపిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఓ వీడియోలో లారెన్స్ గెట‌ప్పులు ఆక‌ట్టుకున్నాయి. అత‌డి మేకోవ‌ర్ ఆక‌ట్టుకుంది. శరత్ కుమార్- నాజ‌ర్ - పూర్ణిమ భాగ్యరాజ్ ఇందులో సహాయక పాత్రలలో కనిపించనున్నారు.

రుద్ర‌న్ లో శరత్ కుమార్ విల‌న్ గా కనిపిస్తార‌ని తెలిసింది. అతని పాత్ర మూవీలో కీలకమైనది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో లారెన్స్ పూర్తిగా యాక్ష‌న్ మోడ్ లో క‌నిపిస్తున్నారు. అంటే రుద్ర‌న్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని భావించ‌వ‌చ్చు. లారెన్స్ సినిమాల్లో కాస్త అర‌వ కామెడీ వాస‌న ఉంటుంది. అలా కాకుండా ఈసారి కామెడీలో కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేస్తాడ‌ని కూడా తెలుస్తోంది. కామెడీ.. ఎమోష‌న్.. యాక్ష‌న్ .. రొమాన్స్.. మ్యూజిక్ హైలైట్ గా ఉండ‌నున్నాయిట‌. రుద్ర‌న్ తో పాటు అదిగ‌ర‌న్ - దుర్గ అనే మ‌రో రెండు చిత్రాల్లోనూ లారెన్స్ న‌టిస్తున్నారు. అయితే కోవిడ్ మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమాల‌న్నీ రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్నాయి.