Begin typing your search above and press return to search.
నేను సూపర్ స్టార్ ని కాదు మొర్రో
By: Tupaki Desk | 9 March 2017 6:07 PM GMTడ్యాన్సర్ గా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారి.. అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు రాఘవ లారెన్స్. ప్రతీ అడుగులోనూ లారెన్స్ కష్టం ఎంతో ఉంటుంది. తాజాగా ఈ హీరో మొట్ట శివ.. కెట్ట శివ చిత్రాన్ని రిలీజ్ చేశాడు. కళ్యాణ్ రామ్ మూవీ పటాస్ కు ఇది తమిళ రీమేక్. ఈ సినిమా టైటిల్స్ లో మక్కల్ సూపర్ స్టార్(పబ్లిక్ సూపర్ స్టార్) రాఘవ లారెన్స్ అని నేమ్ కార్డ్ వేయగా.. దీనిపై ఓపెన్ లెటర్ ద్వారా స్పందించాడు లారెన్స్.
'హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. మీరంతా మొట్ట శివ కెట్ట శివ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నా. దర్శకుడు సాయి రమణి ఈ సినిమాతో నాకు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. మక్కల్ సూపర్ స్టార్ అని పేరు వేయడం చూసి చాలా ఆశ్చర్యోయాను. నేను ఈ టైటిల్ కి సరిపోతానని భావించడం లేదు. నా వరకు నాకు ఒకే ఒక సూపర్ స్టార్ ఉన్నారు. అది తలైవార్ రజినీకాంత్ మాత్రమే. నేను సూపర్ స్టార్ రజినీకాంత్ కు పెద్ద ఫ్యాన్ ని. నన్ను ఈ పరిశ్రమకు పరిచయం చేసింది ఆయనే. నేను ఆయనలో మొదటగా రాఘవేంద్ర స్వామిని చూశాను. నేను ఆయనకు సర్వ విధానాల రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఆయనకు ఫ్యాన్ గానే ఉంటాను' అని రాశాడు రాఘవ లారెన్స్.
'నేను నా పేరుకు టైటిల్ ను.. మా అమ్మ పేరుమీద నేనే ఎంచుకున్నాను. రాబోయే సినిమా నుంచి నా పేరును కణ్మణి రాఘవ లారెన్స్ అని వేసుకుంటాను. అమ్మ పేరు కంటే ఎక్కువగా నాకు ఏదీ ఆనందాన్ని ఇవ్వదు. ఏ టైటిల్ దీనికి సమానం కాదు' అంటూ మదర్ సెంటిమెంట్ తో సూపర్ స్టార్ టైటిల్ ని తిరస్కరిస్తున్నట్లు చెప్పాడు లారెన్స్.